ETV Bharat / international

ఉక్రెయిన్​కు మిసైల్స్​ సరఫరా చేసేందుకు శ్వేతసౌధం గ్రీన్ సిగ్నల్​ - రష్యా ఉక్రెయిన్ తాజా వార్తలు

Russia attack Ukraine
రష్యాఉక్రెయిన్ వార్​
author img

By

Published : Feb 27, 2022, 7:01 AM IST

Updated : Feb 28, 2022, 3:41 AM IST

03:36 February 28

ఉక్రెయిన్​కు ఆయుధ సాయం చేసేందుకు శ్వేతసౌధం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా తొలుత ఉక్రెయిన్​కు స్ట్రింగర్​ క్షిపణులను డెలివరీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

01:12 February 28

249 మందితో స్వదేశానికి మరో విమానం..

ఉక్రెయిన్​లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే ఆపరేషన్​ గంగాలో భాగంగా మరో విమానం రొమేనియా సరిహద్దులకు చేరుకున్న 249 మందితో ఐదో విమానం దిల్లీకి బయల్దేరింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​ తెలిపారు.

01:07 February 28

ఉక్రెయిన్​ పై సైనిక చర్యకు ఫలితంగా ఇంగ్లాండ్​ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాతో జరగబోయే అన్నీ అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌లను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఫుట్‌బాల్ అసోసియేషన్ ఓ ప్రకటనను విడుదల చేసింది.

21:47 February 27

ఉక్రెయిన్​ ఇష్యూపై మోదీ భేటీ..

ఉక్రెయిన్​ వివాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

21:15 February 27

పుతిన్‌ 'అణు' హెచ్చరిక ప్రమాదకరం: నాటో

అణ్వాయుద దళాలను అప్రమత్తంగా ఉండాలంటూ రష్యా అధ్యక్షుడ వ్లాదిమిర్‌ పుతిన్‌ చేసిన వ్యాఖ్యలను నాటో తప్పుబట్టింది. అలాంటి వ్యాఖ్యలు ప్రమాదకరమని, బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవని నాటో కూటమి సెక్రటరీ జనరల్‌ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ అన్నట్లు ఆయన వ్యాఖ్యలను ఉటంకించింది ఏఎఫ్​పీ న్యూస్​ ఏజెన్సీ.

20:49 February 27

రష్యా విమానయాన సంస్థలకు షాక్‌ ఇస్తున్న దేశాలు..

ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ ఆపరేషన్‌కు నిరసనగా.. ఆయా దేశాలు రష్యా విమానాల కోసం తమ ఎయిర్‌స్పేస్‌ను మూసివేస్తున్నాయి. తాజాగా ఫ్రాన్స్​, స్పెయిన్‌, కెనడా, ఐస్‌ల్యాండ్‌, బెల్జియం, ఫిన్లాండ్‌ తదితర దేశాలు ఈ జాబితాలో చేరాయి. జర్మనీ కూడా ఈ విధమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోన్నట్లు సమాచారం.

మరోవైపు.. స్వీఫ్ట్​ నుంచి రష్యా బ్యాంకులను తప్పించటంలో అమెరికా, ఐరాపా దేశాలతో చేతులు కలిపేందుకు సిద్ధమని జపాన్​ ప్రధాని ఫుమియో కిషిదా తెలిపారు.

20:32 February 27

ఉక్రెనియన్లను ఆదుకునేందుకు అమెరికా సాయం

ఉక్రెయిన్ ప్రజలను ఆదుకునేందుకు అమెరికా తాజాగా దాదాపు 54 మిలియన్‌ డాలర్ల అదనపు సాయాన్ని ప్రకటించింది. దీంతో ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఉక్రెయిన్ పౌరులతోపాటు రష్యా దాడులతో ప్రభావితమైనవారికి ఆయా సంస్థలు సాయమందించే అవకాశం కలుగుతుందని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ తెలిపారు.

19:39 February 27

బెలారస్​ సరిహద్దులో ఉక్రెయిన్​-రష్యా దౌత్యవేత్తల భేటీ

రష్యన్​ అధికారులతో తమ దేశ దౌత్యవేత్తలు సమావేశమవుతారని ఉక్రెయిన్​ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. బెలారస్​ సరిహద్దుల్లోని చెర్నోబిల్​ ఎక్స్​క్లుసివ్​ జోన్​ ప్రాంతంలో ఇరు దేశాల అధికారులు భేటీ అవుతారని టెలిగ్రామ్​ మెసేజింగ్​ యాప్​ ద్వారా అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ కార్యాలయం తెలిపింది. అయితే, ఈ సమావేశం ఏ సమయానికి జరుగనుందనేదని స్పష్టతనివ్వలేదు.

చర్చల కోసం తమ దేశ ప్రతినిధులు బెలారస్​కు బయలుదేరినట్లు రష్యా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ మేరకు ఉక్రెయిన్​ ప్రకటన చేసింది. అయితే, ముందుగా బెలారస్​లో చర్చలను తిరస్కరించింది ఉక్రెయిన్​. వేరే ప్రాంతంలో చర్చలు చేపట్టాలని తెలిపింది.

అణ్వాయుధ దళాలను అలర్ట్​ చేసిన పుతిన్​

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ తమ అణ్వాయుధ దళాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఉక్రెయిన్​పై రష్యా దాడి. అణ్వాయుధాల వినియోగానికి దారితీస్తుందనే ప్రపంచ దేశాల ఆందోళనలను ఈ ప్రకటన మరింత పెంచినట్లయింది. అయితే, పుతిన్​ ఆదేశాలు ఆమోదయోగ్యం కాదని ఐరాసలోని అమెరికా రాయబారి లిండా థామస్​ గ్రీన్​ఫీల్డ్​ స్పష్టం చేశారు.

19:05 February 27

ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం

ఉక్రెయిన్​పై రష్యా సైనిక చర్య కొనసాగుతున్న నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యున్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్‌ అంశం, భారతీయుల తరలింపుపై చర్చించనున్నట్లు సమాచారం.

18:40 February 27

ఫ్లాష్​ ఫ్లాష్​.. చర్చలకు ఓకే..

రష్యాతో చర్చలకు ఉక్రెయిన్​ గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. బెలారస్​లోనే చర్చలకు సిద్ధమని చెప్పినట్లు రష్యా అధికారిక మీడియా వెల్లడించింది.

18:17 February 27

ఉక్రెయిన్​ పశ్చిమ ప్రాంతాలకు వెళ్లండి.. భారతీయులకు సూచన

ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం కీవ్​లోని భారత రాయబార కార్యాలయం ఆదివారం మరో కీలక ప్రకటన జారీ చేసింది కర్ఫ్యూ ఎత్తివేశాక.. కల్లోలిత ప్రాంతాల నుంచి పశ్చిమ ప్రాంతాల వైపు తరలివెళ్లాలని సూచించింది. ఇందుకోసం రైళ్లను ఎంచుకుంటే మేలని చెప్పింది. ఉక్రెయిన్​ ప్రత్యేకంగా ఉచిత రైళ్లను నడుపుతోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ప్రస్తుతం ప్రయాణానికి అనుకూలమైన పరిస్థితి లేదని లేదా ఏ కారణంతోనైనా బయటకు వెళ్లలేమని భావించేవారు..వేచి ఉండాలని తెలిపింది.

16:42 February 27

రష్యన్​ ఎయిర్​లైన్స్​పై బెల్జియం ఆంక్షలు..

ఉక్రెయిన్​పై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతున్న రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతోంది. తాజాగా రష్యా విమానయాన సంస్థలు.. తమ గగనతలాన్ని ఉపయోగిచుకోకుండా నిషేధం విధించింది బెల్జియం. ఎయిర్​స్పేస్​ను మూసివేసినట్లు వెల్లడిచింది.

ఐసీజేకు ఉక్రెయిన్​ ఫిర్యాదు..

రష్యా సైనిక చర్యపై ఇంటర్నేషనల్​ కోర్ట్​ ఆఫ్​ జస్టీస్​(ఐసీజే)కు ఫిర్యాదు చేసింది ఉక్రెయిన్​. మారణహోమాన్ని మార్చి చూపించే ప్రయత్నం దురాక్రమణను సమర్థించుకోవడానికి జరుగుతున్న మారణహోమంపై తప్పుడు మాటలు చెబుతున్నందుకు రష్యా బాధ్యత వహించాలని ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ పేర్కొన్నారు. మిలిటరీ చర్యను ఉపసంహరించుకునేలా రష్యాకు ఆదేశాలు ఇవ్వటంపై వేగంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. వచ్చే వారం దర్యాప్తు ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రష్యాతో ఆటకు నిరాకరణ

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ప్లేఆఫ్స్‌లో రష్యాతో ఆటకు నిరాకరించింది చెక్‌ రిపబ్లిక్‌. రష్యాతో ఆడేందుకు చెక్‌రిపబ్లిక్‌ విముఖంగా ఉందని స్పష్టం చేసింది ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌

దేశం దాటిన 3.68 లక్షల మంది

రష్యా చేస్తున్న భీకర దాడులతో ఉక్రెయిన్​ అల్లాడిపోతోంది. ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని దేశాన్ని వీడుతున్నారు. రష్యా దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 3,68,000 మంది ఉక్రెయిన్​ ప్రజలు దేశం విడిచి పక్క దేశాలకు వెళ్లారు.

16:24 February 27

ఉక్రెయిన్​ సంక్షోభంపై ఐరాస భద్రత మండలి ప్రత్యేక భేటీ

ఉక్రెయిన్​పై రష్యా సైనిక చర్యలు పాల్పడి భీకర దాడులు చేపడుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్​ అంశంపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఈ సమావేశం జరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

రష్యాపై గూగుల్​ ఆంక్షలు..

ఉక్రెయిన్‌పై రష్యా అమానుష దాడికి నిరసనగా..రష్యన్‌ స్టేట్‌ మీడియా తమ ఫ్లాట్‌ఫాంలలో ఆదాయాన్ని అర్జించకుండా గూగుల్‌నిషేధం విధించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన గూగుల్‌ప్రతినిధి.. ఉక్రెయిన్‌పై దాడికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు నిశితంగా పరిశీలిస్తున్నామన్న గూగుల్‌ తదుపరి చర్యలకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేసింది. రష్యా మీడియా ఛానెళ్లు తమ వీడియోల ద్వారా డబ్బు అర్జించకుండా ఆంక్షలు విధిస్తున్నట్లు యూట్యూబ్‌ప్రకటించిన కొద్ది గంటల్లోనే.. గూగుల్‌సైతం నిషేధాజ్ఞలు జారీ చేయటం ఆసక్తి రేపుతోంది. అంతకుముందు ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న అమానుష దాడికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు యూట్యూబ్‌ప్రతినిధి తెలిపారు. రష్యా పెట్టుబడులతో నడుస్తున్న ఛానెళ్లను తమ సిబ్బంది నిలిపివేస్తున్నట్లు చెప్పారు.

15:59 February 27

వీసా లేకుండానే పొలండ్​లోకి భారతీయులకు అనుమతి

రష్యా సైనిక చర్య నేపథ్యంలో స్వదేశానికి వచ్చేందుకు ఉక్రెయిన్​ నుంచి పొలండ్​కు చేరుకుంటున్న భారతీయ విద్యార్థులకు ఎలాంటి వీసా లేకుండానే ప్రవేశానికి అనుమతిస్తున్నారు. ఈ విషయాన్ని భారత్​లోని పొలండ్​ రాయబారి ఆడమ్​ పురాకోవిస్కీ ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

15:43 February 27

'ఐరాస భద్రతా మండలి నుంచి రష్యాను తొలగించాలి'

ఉక్రెయిన్​పై క్షిపణులు, బాంబులతో భీకర దాడులకు పాల్పడుతున్న రష్యాపై కఠిన ఆంక్షలు విధించాలని మరోమారు నొక్కిచెప్పారు ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ. ఉక్రెయిన్​పై దాడికి పాల్పడుతున్న కారణంగా.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నుంచి రష్యాను తొలగించాలని కోరారు. ఈ మేరకు మరో వీడియోను విడుదల చేశారు జెలెన్​స్కీ.

"రష్యా చెడు మార్గాన్ని ఎంచుకుంది. ఉక్రెయిన్​పై రష్యా సైనిక చర్య మారణహోమమే. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నుంచి రష్యాను తొలగించేందుకు యావత్​ ప్రపంచం ముందుకు రావాలి. అంతర్జాతీయ యుద్ధ నేరాల ట్రైబునల్​ ద్వారా రష్యా దాడులపై దర్యాప్తు చేయాలి. నివాస ప్రాంతాలపై దాడులు చేయటం లేదంటున్న రష్యా మాటలు అవాస్తవం."

- వొలొదిమిర్​ జెలెన్​స్కీ, ఉక్రెయిన్​ అధ్యక్షుడు.

15:23 February 27

పుతిన్‌కు జూడో ఫెడరేషన్‌ షాక్‌

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అంతర్జాతీయ జూడో ఫెడరేషన్‌ షాకిచ్చింది. జూడో ఫెడరేషన్‌ గౌరవాధ్యక్ష, ఇంటర్నేషనల్‌ జూడో ఫెడరేషన్‌ అంబాసిడర్‌ పదవుల నుంచి సస్పెండ్‌ చేసింది. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐజేఎఫ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

14:12 February 27

బెలారస్‌లోని గోమెల్‌ నగరంలో శాంతి చర్చలకు సిద్ధమంటూ రష్యా చేసిన ఆఫర్‌ను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తిరస్కరించారు. బెలారస్‌లోని పలు ప్రాంతాల నుంచీ రష్యా దాడులు చేస్తోందని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తమపై విరుచుకుపడని దేశాల్లో మాత్రమే చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. పోలండ్‌ రాజధాని వార్సా, టర్కీలోని ఇస్తాంబుల్‌, అజర్‌బైజాన్‌ రాజధాని బకూ వంటి ప్రాంతాలు చర్చలకు అనువైనవిగా ఆయన పేర్కొన్నారు.

మరోవైపు గత రాత్రి ఉక్రెయిన్‌లో రష్యా సేనల దాడులు అత్యంత క్రూరంగా కొనసాగాయని జెలెన్‌స్కీ తెలిపారు. సామాన్య పౌరులు నివసిస్తున్న ప్రాంతాలను సైతం లక్ష్యంగా చేసుకున్నారన్నారు. చివరకు అంబులెన్సులపైనా దాడి చేస్తున్నారని ఆరోపించారు.

ఉక్రెయిన్‌కు విదేశీ మాజీ సైనికుల సాయం?

మరోవైపు సైన్యంలో పనిచేసిన అనుభం ఉన్న ఐరోపావాసులెవరైనా సరే ఉక్రెయిన్‌ చేస్తున్న పోరాటంలో చేరాలని జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. ఐరోపాను కాపాడుకోవడానికి ఇది చాలా అవసరమంటూ వారిలో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. దీంతో ఎస్టోనియా, లాత్వియా, జార్జియా, పోలండ్‌ వంటి దేశాల నుంచి పలువురు మాజీ సైనికులు ఉక్రెయిన్‌కు వస్తున్నట్లు అక్కడి స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

13:02 February 27

ఉక్రెయిన్​తో రష్యా యుద్ధం నేపథ్యంలో.. ఉక్రెయిన్ ప్రతినిధులతో ​చర్చలు జరిపేందుకు రష్యా సిద్ధమైంది. ఈ మేరకు బెలారస్ నగరంలోని హోమెల్​కు చేరుకున్నారు రష్యా ప్రతినిధులు. ఇక్కడే ఉక్రెయిన్​ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

12:18 February 27

  • Russian troops have entered Ukraine's second city Kharkiv and fighting is under way, the head of the regional administration said: AFP News Agency#RussiaUkraineConflict

    — ANI (@ANI) February 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఖార్కివ్‌లోకి ప్రవేశించిన రష్యా బలగాలు..

ఉక్రెయిన్​పై దండయాత్రలో భాగంగా రష్యా బలగాలు చెలరేగిపోతున్నాయి. ఉక్రెయిన్​లోని రెండో పెద్ద నగరం ఖార్కివ్‌లోకి ప్రవేశించాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రష్యా బలగాలపై సైనికులతో పాటు స్థానిక ప్రజలు తిరగబడ్డారు. దీంతో ఖార్కివ్‌లో వీధి పోరాటాలు మొదలయ్యాయి.

ఉక్రెయిన్​లో చమురు పైప్​లైన్​ పేల్చివేత

ఉక్రెయిన్​లోని ఖర్కీవ్​ నగరాన్ని స్వాధీనం చేస్కున్న రష్యా సేనలు.. అక్కడి సహజవాయువు పైప్​లైన్​ను పేల్చివేశాయి. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. పర్యావరణంపై ఇది పెను ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

12:12 February 27

ఉక్రెయిన్​కు అండగా మస్క్​..

రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్‌కు బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ బాసటగా నిలిచారు. స్టార్‌లింక్‌ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్ని ప్రారంభించి నిరంతరాయ ఇంటర్నెట్‌ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరిన్ని టెర్మినళ్లను సైతం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

11:39 February 27

ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర నాలుగో రోజూ భీకరంగా కొనసాగుతోంది. రాజధాని నగరం కీవ్​లోకి ప్రవేశించేందుకు రష్యా సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్​లోని గ్యాస్​, చమురు నిక్షేపాలపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో పలు నగరాల్లో భారీ పేలుళ్ల మోత మోగుతోంది. ఉక్రెయిన్ బలగాలు మాత్రం రష్యా దాడులను తిప్పికొడుతున్నాయి. కీవ్​లోకి ప్రవేశించకుండా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి.

11:01 February 27

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చే ప్రక్రియలో భాగంగా హంగేరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి240 మందితో బయలుదేరిన ఎయిర్‌ఇండియా మూడో విమానం దిల్లీ చేరింది. ఇప్పటివరకు ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు 709 మంది వచ్చారు. భారత్‌ నుంచి రొమేనియాకు రెండు విమానాలు పంపగా..219 మందితో శనివారం మొదటి విమానం ముంబయి చేరుకుంది. రొమేనియా నుంచి 250 మందితో, బుడాపెస్ట్ నుంచి 240 మందితో బయలేరిన రెండు విమానాలు దిల్లీకి చేరుకున్నాయి. సురక్షితంగా భారత్ కు చేరుకోవడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

09:43 February 27

ఉక్రెయిన్​లో 64 మంది మృతి..

ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 64 మంది ఉక్రెయిన్​ వాసులు మృతిచెందినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దాదాపు 240 మందికి గాయాలైనట్లు పేర్కొంది.

అయితే మృతుల సంఖ్య అంతకంటే ఎక్కువే ఉండొచ్చని తెలిపింది యూఎన్.

09:20 February 27

గ్యాస్​పైప్​లైన్​ పేల్చేసిన రష్యా..

రష్యా బలగాలు ఉక్రెయిన్​లో రెచ్చిపోతున్నాయి. కార్కివ్​ నగరంలోని గ్యాస్​పైప్​లైన్​ను రష్యా సైనికులు పేల్చేశారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడి భవనం తెలిపింది. గ్యాస్​పైప్​లైన్​ పేలినప్పుడు ఆకాశంలో దట్టమైన పొగ ఏర్పడిందని కార్కివ్​లోని స్పెషల్ కమ్యూనికేషన్​ అండ్ ఇన్ఫర్మేషన్​​ ప్రొటక్షన్ విభాగం తెలిపింది. పర్యావరణ హాని జరుగుతుందని తెలిపింది. ప్రజలు కిటికీలు మూసేసి తగినన్ని నీళ్లు తీసుకోవాలని చెప్పింది.

కార్కివ్​లో రష్యా బలగాలు, ఉక్రెయిన్​ సైనికుల మధ్య భీకర పోరు సాగుతోందని ఉక్రెయిన్​కు చెందిన న్యాయవాది ఇరినా వెనెడిక్టోవా తెలిపారు.

09:18 February 27

'పుతిన్‌కు పిచ్చిపట్టింది'

ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతోంది. రాజధాని కీవ్‌లో బాంబుల మోత మోగుతోంది. దీంతో ఉక్రెయిన్‌ పౌరులు కూడా ఆయుధాలు చేతబూని రణంలోకి దిగుతున్నారు. ఆ దేశ మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకో సైతం ఏకే47 తుపాకీతో తమ సైన్యంతో కలిసి గస్తీ కాస్తున్నారు. మా ప్రాణాలు ఉన్నంతవరకు రష్యా మా దేశాన్ని ఆక్రమించుకోలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడిపై పోరోషెంకో మండిపడ్డారు. పుతిన్‌కు పిచ్చిపట్టిందని వ్యాఖ్యానించారు. పుతిన్‌ కేవలం ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించలేదని, ప్రపంచ దేశాలపై యుద్ధం ప్రకటించాడని పేర్కొన్నారు. దేశం కోసం పోరాడేందుకు తమ పౌరులు సిద్ధంగా ఉన్నారని, కానీ తమవద్ద ఆయుధాలు లేనవన్నారు.

'ప్రస్తుతం ఈ ప్రాంతంలో 300 మంది సైన్యంతో గస్తీ కాస్తున్నాం. పరిమిత సంఖ్యలో మెషీన్‌ గన్స్‌ ఉన్నాయి. కానీ యుద్ధ ట్యాంకులు, భారీ మందుగుండు సామగ్రి లేదు. మాకు మరిన్ని ఆయుధాలు కావాలి. ఈ యుద్ధంలో పాల్గొనేందుకు అనేకమంది పౌరులు ముందుకు వస్తున్నారు. కానీ వారికి అందించేందుకు మా వద్ద ఆయుధాలు లేవు'అని అన్నారు. అయినప్పటికీ భయపడబోమని, ఎంతమంది సైనికులు దాడిచేసినా, మిస్సైల్స్‌ వదిలినా ఉక్రెయిన్‌ను ఆక్రమిచుకోలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యుద్ధ సామగ్రిని అందించేందుకు ముందుకొచ్చిన అమెరికా, బ్రిటన్‌కు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

ఉక్రెయిన్‌ పార్లమెంట్‌ సభ్యురాలు కియారా రుదిక్‌ సైతం యుద్ధంలోకి దిగారు. చేతిలో ఏకే47తో ఉన్న ఓ ఫోటోను ట్విటర్‌లో పంచుకున్నారు. 'తుపాకీని ఎలా వాడాలో నేర్చుకున్నా. మా మట్టిని కాపాడుకునేందుకు మా పురుషులు ఎలాగైతే యుద్ధం చేస్తున్నారో అదే తరహాలో మహిళలు కూడా రంగంలోకి దిగుతున్నారు' అంటూ పేర్కొన్నారు.

07:02 February 27

240 మంది భారతీయులతో బయల్దేరిన మరో విమానం..

ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం చేపట్టిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. ఇప్పటికే రెండు విమానాలు భారత్​ కు చేరుకోగా మరో విమానం బుడాపేస్ట్​ (హంగేరీ ) నుంచి బయలుదేరింది. ఈ విమానం 240 మందితో బయలుదేరి దిల్లీకి చేరనుంది.

07:01 February 27

ఆ దేశ విమానాలపై నిషేధం విధించిన రష్యా..

లిథువేనియా, లాట్వియా, ఎస్టోనియా, స్లోవేనియా నుంచి వచ్చే విమానాలపై రష్యా నిషేధం విధించింది. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో పశ్చిమ దేశాలతో రష్యా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే రష్యా ఈ నిర్ణయం తీసుకుంది.

06:45 February 27

ఉక్రెయిన్​తో చర్చలకోసం బెలారస్​కు రష్యా ప్రతినిధులు

ఎటు చూసినా బాంబుల మోతలు.. సైరన్‌ కూతలు. ఏవైపు నుంచి క్షిపణులు దూసుకొచ్చి బతుకుల్ని ఛిద్రం చేస్తాయో తెలియని భయానక పరిస్థితి. కుప్పకూలుతున్న భవంతులు, ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీస్తున్న జనం. భారీ ఆయుధాలతో చొచ్చుకొస్తున్న రష్యన్‌ సేనలు, అంతే తీవ్రతతో ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌ బలగాలు. ఎటువైపు ఎందరు మరణించారో అంతుచిక్కని పరిస్థితి. కీవ్‌ నగరంపై పట్టు కోసం రష్యన్‌ బలగాలు ఎంతగా ప్రయత్నిస్తుంటే.. దాన్ని ఉక్రెయిన్‌ సేన అంతే దృఢచిత్తంతో తిప్పికొడుతోంది. పైచేయి సాధించడానికి ఇరు వర్గాలు చేస్తున్న పోరాటం వీధుల్లోకి వచ్చింది. కీవ్‌ నగరం నడిబొడ్డుకు 30 కి.మీ. దూరంలో రష్యా బలగాలు ఎక్కువగా మోహరించి ఉన్నాయి. తగ్గేదేలేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కుండబద్దలు కొట్టారు. దేశం విడిచిపోయేందుకు సాయం చేస్తానని అమెరికా ముందుకు వచ్చినా, దానిని ఆయన తిరస్కరించారు. లొంగిపోయే ప్రసక్తి లేదని, పోరాడి చూపిస్తామని ప్రకటించారు. రష్యాను నిలువరించడానికి ఓ సైనికుడు తనను తాను పేల్చివేసుకుని దేశభక్తిని చాటుకున్నాడు. అటు- రష్యాపై ఆంక్షలు విధించడానికి ఐరాస భద్రత మండలి సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. దీనిని రష్యా వీటో చేసింది.

చెర్నోబిల్‌ సమీపంలో రేడియో ధార్మికత పెరగడం ఆందోళనకు తావిస్తోంది. భారత ప్రధాని నరేంద్రమోదీతో జెలెన్‌స్కీ ఫోన్లో మాట్లాడారు. శాంతి యత్నాలకు సహకరిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపు చర్యలు ఊపందుకున్నాయి. నివాసాలపైనా దాడులు జరుగుతుండడంతో ప్రజలంతా తమతమ ఇళ్లలోనే ఉండాలంటూ ఉక్రెయిన్‌ అధికారులు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. కిటికీలకు దూరంగా ఉండాలనీ, తూటాలు/ ఇతర శకలాలు తమపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వీలైనంతమంది ప్రజలు బంకర్లలోనే తలదాచుకుంటున్నారు.

కొనసాగుతున్న హోరాహోరీ

ఎన్ని ప్రాంతాలు రష్యా చేతికి చిక్కాయన్న సమాచారంపై స్పష్టత కొరవడింది. పలు చోట్ల రష్యా బలగాలను తిప్పికొట్టామని, రాజధానికి సమీపంలో మాత్రం హోరాహోరీగా పోరు కొనసాగుతోందని ఉక్రెయిన్‌ అధికారులు చెబుతున్నారు. తాము ముందుకు వెళ్లడానికి వీలుగా మార్గంలో అడ్డంకులు తొలగించాలని రష్యా ఒత్తిడి చేస్తున్న చోట్ల రెండు దేశాల బలగాల మధ్య ఘర్షణ తలెత్తుతోంది. దురాక్రమణను తట్టుకుని నిలుస్తామని జెలెన్‌స్కీ పునరుద్ఘాటించారు.

రెండు రవాణా విమానాల కూల్చివేత!

పారాట్రూపర్లతో వెళ్తున్న రష్యా రవాణా విమానాన్ని వసిల్‌కీవ్‌ సమీపంలో కూల్చివేశామని ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. కీవ్‌కు 85 కి.మీ. దూరంలో మరో రవాణా విమానాన్నీ కూల్చివేసినట్లు తెలిపింది. దీనిని అమెరికా నిఘా విభాగ అధికారి ఒకరు కూడా ధ్రువీకరించారు. దీనిపై రష్యా స్పందించలేదు. కీవ్‌ నగరానికి నీరందించే జలాశయం వైపు దూసుకువెళ్తున్న రష్యా క్షిపణిని శనివారం తెల్లవారుజామున కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది.

ముప్పేట దాడి

యుద్ధంలో భాగంగా సైనిక స్థావరాలే లక్ష్యంగా రష్యా పదాతిదళాలు ఉక్రెయిన్‌ ఉత్తర, తూర్పు, దక్షిణ దిశల వైపు వెళ్తున్నాయి. దాడుల్లో వంతెనలు, పాఠశాలలు, అపార్ట్‌మెంట్లు దెబ్బతింటున్నాయి. అనేక వందలమంది గాయాలపాలవుతున్నారు. కీవ్‌లో బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్‌ సముదాయంపై క్షిపణి దాడి జరిగినట్లు మేయర్‌ ధ్రువీకరించారు. కనీసం ఐదంతస్తులు దెబ్బతిన్నట్లు ఛాయాచిత్రాలు బయటకు వచ్చాయి. ఆ వీధి అంతా శిథిలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. 'భయంభయంగా ఉంది. కలవరం కలుగుతోంది. ఏం చేయాలో తెలియట్లేదు. రాబోయే కొద్దిరోజుల్లో ఇంకేం జరుగుతుందో' అని ఓ చిన్న హోటల్లో పనిచేసే లూసీ వషాకా ఆందోళన వ్యక్తంచేశారు. రష్యా దళాల దూకుడు నేపథ్యంలో కీవ్‌లో కర్ఫ్యూ వేళల్ని మరింత పెంచారు.

ఇక ఓడరేవుల స్వాధీనంపై కన్ను

కీవ్‌ నగరంతో పాటు ఉక్రెయిన్‌ తీరప్రాంతంపై రష్యా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఓడరేవులను స్వాధీనం చేసుకునేందుకు సైనికులు ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే ఓడరేవులపై నియంత్రణను కోల్పోయి ఉక్రెయిన్‌ ఆర్థిక వ్యవస్థ మరింత దెబ్బతినవచ్చని భావిస్తున్నారు. సముద్ర మార్గం ద్వారా రష్యా నౌకాదళం దాడి చేయవచ్చనే ఆందోళన నేపథ్యంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రష్యా అనుకూల వేర్పాటువాదులు ఉన్న రెండు ప్రదేశాల్లోనూ పోరు సాగుతోంది.

లక్షల మంది వలస

యుద్ధ భయంతో ఇప్పటికే లక్ష మంది ఇళ్లను వీడి వెళ్లాల్సి వచ్చిందని, తీవ్రత పెరిగితే 40 లక్షల మంది వరకు ఉక్రెయిన్‌ను వీడి పశ్చిమ దేశాలకు వలస వెళ్లవచ్చని ఐరాస భావిస్తోంది. ప్రయాణ పత్రాలు ఉన్నవారు, లేనివారు కూడా ఉక్రెయిన్‌ నుంచి తమ దేశంలోకి వచ్చేందుకు హంగరీ, పోలండ్‌ దేశాలు అనుమతిస్తున్నాయి. ప్రాణనష్టం ఎంత ఉండవచ్చనే విషయంలో స్పష్టత లేదు. తమవైపు 198 మంది చనిపోయారనీ, రష్యాకు చెందిన వందల మంది ప్రాణాలు కోల్పోయారనీ ఉక్రెయిన్‌ చెబుతోంది. రష్యా మాత్రం మృతుల సంఖ్యపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉక్రెయిన్‌పై చివరకు ఏం చేయదలచుకున్నదీ పుతిన్‌ ప్రకటించలేదు. జెలెన్‌స్కీని అధ్యక్షుడిగా రష్యా గుర్తిస్తుందని, తమ సైనిక చర్య ఎన్నాళ్లు కొనసాగుతుందనేది చెప్పలేమని పుతిన్‌ ప్రతినిధి ద్మిత్రి పెస్‌కోవ్‌ అంటున్నారు.

తమ భవితవ్యాన్ని ఉక్రెయిన్‌ ప్రజలే నిర్ణయించుకోవాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్‌రొవ్‌ అన్నారు. మరో వైపు తమ సభ్యదేశాలకు సాయపడడానికి మొట్టమొదటిసారిగా 'కూటమి ప్రతిస్పందన బలగాల’ను పంపించాలని నాటో నిర్ణయించింది.

ఉక్రెయిన్‌కు జర్మనీ ఆయుధాలు

రష్యా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్‌కు ట్యాంకు విధ్వంసక ఆయుధాలను చేరవేసేందుకు సమ్మతిస్తూ జర్మనీ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికితోడు 'స్విఫ్ట్‌' అంతర్జాతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థలో రష్యా భాగస్వామ్యంపై కొన్ని ఆంక్షలు విధించడానికీ మద్దతిస్తామని ప్రకటించింది.

"మేం రూపొందించిన 400 ట్యాంకు విధ్వంసక ఆయుధాలను ఉక్రెయిన్‌కు చేరవేయడానికి నెదర్లాండ్స్‌కు అనుమతిచ్చాం" అని జర్మనీ ఆర్థిక, వాతావరణ మంత్రిత్వశాఖ శనివారం ఒక ప్రకటన చేసింది. ఇప్పటిదాకా రష్యా విషయంలో కఠినంగా వ్యవహరించని జర్మనీ ఇప్పుడు హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చెప్పుకోదగిన పరిణామం. ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లోకి ప్రమాదకర ఆయుధాలను పంపకూడదన్నది జర్మనీ విధానం. దీనికి కట్టుబడి ఉంటామని ప్రభుత్వ అధికారులు శుక్రవారం తెలిపారు. శనివారం సాయంత్రానికి ఆ నిర్ణయాన్ని మార్చుకోవడం గమనార్హం.

Last Updated : Feb 28, 2022, 3:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.