ETV Bharat / international

'ఉక్రెయిన్​లోని వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్ర హోదా' - రష్యా తాజా వార్తలు

Russia Ukraine Crisis: తూర్పు ఉక్రెయిన్​లోని వేర్పాటువాద ప్రాంతాలైన డొనెట్స్క్‌, లుహాన్స్క్‌ను స్వతంత్ర హోదా ప్రకటించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్‌ తెలిపారు. ఈ ప్రాంతాలకు రష్యా నుంచి మిలిటరీ సహకారం ఉంటుందని అన్నారు. ఉక్రెయిన్‌ను ఇతర శక్తులు తోలుబొమ్మ చేసి ఆడిస్తున్నాయని పరోక్షంగా అమెరికాపై నిప్పులు చెరిగారు పుతిన్.

Putin
పుతిన్
author img

By

Published : Feb 22, 2022, 4:16 AM IST

Russia Ukraine Crisis: తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్రత కల్పిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్‌ వెల్లడించారు. ఇకనుంచి డొనెట్స్క్‌, లుహాన్స్క్‌ స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తిస్తామని అన్నారు. ఈ రాష్ట్రాలకు రష్యా నుంచి మిలిటరీ సహకారం ఉంటుందని తెలిపారు. ఈ మేరకు రష్యా జాతినుద్దేశించి పుతిన్ ప్రసంగించారు.

ఉక్రెయిన్​ను తోలుబొమ్మ చేసి..

ఉక్రెయిన్‌ను ఇతర శక్తులు తోలుబొమ్మ చేసి ఆడిస్తున్నాయని పరోక్షంగా అమెరికాపై నిప్పులు చెరిగారు పుతిన్. ఇతరశక్తుల ద్వారా మమ్మల్ని నియంత్రించాలనుకుంటున్నారని మండిపడ్డారు.

ఉక్రెయిన్‌ను బయటి శక్తులు నియంత్రిస్తున్నాయి. అమెరికా రాయబార కార్యాలయం కీవ్‌లో కోట్లు కుమ్మరిస్తోంది. ఉక్రెయిన్‌ పాఠశాలల్లో రష్యన్‌ భాష తొలగించారు. ఉక్రెయిన్‌.. రష్యాను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు యత్నిస్తోంది. ఉక్రెయిన్‌.. రష్యా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. రష్యాకు కలుగుతున్న ముప్పుపై స్పందించకుండా ఉండలేం. గతేడాది ఉక్రెయిన్‌లో 20,000 మంది సైనికులు మాత్రమే ఉన్నారు.

-- వ్లాదిమిర్​ పుతిన్‌, రష్యా అధ్యక్షుడు

రష్యాపై ఏ క్షణమైనా దాడి జరిగే ప్రమాదం ఉందని పుతిన్ హెచ్చరించారు. పెంటగాన్‌ బహిరంగంగానే భూఆధారిత క్షిపణులను తయారుచేస్తోందని మండిపడ్డారు.

మా డిమాండ్‌ అదే..

నాటోలో ఉక్రెయిన్‌ను చేర్చకూడదనేదే తమ డిమాండ్‌ అని పుతిన్‌ తెలిపారు. రష్యాపై వ్యతిరేక చర్యలను అడ్డుకునే హక్కు తమకుందని అన్నారు.

ఉక్రెయిన్‌ అంశంలో చర్చలకు తాము ఎప్పుడైనా సిద్ధమేనని పుతిన్ అన్నారు. భద్రత విషయంలో రష్యా ఆందోళనలను నాటో పట్టించుకోలేదని మండిపడ్డారు.

ఇదీ చూడండి: ఉక్రెయిన్ జవాన్లపై రష్యా సైన్యం దాడి- ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.