ETV Bharat / international

అత్యాధునిక హైపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

అత్యాధునిక హైపర్‌సోనిక్‌ క్షిపణిని పరీక్షించింది రష్యా. ధ్వని వేగానికి 7 రెట్ల అధిక వేగంతో ప్రయాణించి 350 కి.మీ. దూరంలోని నిర్దేశిత లక్ష్యాన్ని సమర్థవంతంగా పూర్తిచేసిందని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. తెల్లసముద్రంలో అడ్మిరల్‌ గోర్షకోవ్‌ యుద్ధ నౌక నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టింది.

hypersonic missile
క్షిపణి పరీక్ష విజయవంతం
author img

By

Published : Jul 21, 2021, 5:24 AM IST

శత్రువుల నిఘా వ్యవస్థలు గుర్తించి స్పందించేలోపే లక్ష్యాలను ఛేదించే లక్ష్యంతో రూపొందిస్తున్న అత్యాధునిక హైపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణిని సోమవారం రష్యా విజయవంతంగా పరీక్షించింది. తెల్లసముద్రంలో అడ్మిరల్‌ గోర్షకోవ్‌ యుద్ధ నౌక నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ధ్వని వేగానికి 7 రెట్ల అధిక వేగంతో ప్రయాణించి 350 కి.మీ. దూరంలోని నిర్దేశిత లక్ష్యాన్ని సమర్థవంతంగా పూర్తిచేసిందని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది.

జిర్కాన్‌ క్షిపణి 1000 కి.మీ.దూరం ప్రయాణించగలదని, ధ్వని వేగం కన్నా 9 రెట్లు ఎక్కువ వేగంతోనూ దూసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతమని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. యుద్ధ నౌకలు, జలాంతర్గాములపై మోహరించే లక్ష్యంతో రష్యా వీటిని అభివృద్ధి చేస్తోంది.

రష్యా క్షిపణి అభివృద్ధి కార్యక్రమం ఐరోపా-అట్లాంటిక్‌ ప్రాంతంలో భద్రతాపరమైన సవాళ్లను, అపోహలను అధికం చేస్తోందంటూ నాటో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ముప్పును తిప్పికొట్టేలా సన్నద్ధమవుతామని తెలిపింది.

ఆధునిక యుద్ధవిమానం..

ఆధునిక నూతన యుద్ధవిమానం ప్రోటోటైప్‌ను రష్యా విమాన తయారీ సంస్థ సుఖోయ్‌ ఆవిష్కరించింది. జుకోవ్‌స్కీలో నిర్వహించిన అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనలో... కొత్త యుద్ధవిమానం ప్రోటోటైప్‌ను..రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ పరిశీలించారు. నూతన యుద్ధవిమానం 2023లో ప్రయాణానికి సిద్ధమవుతుందని.. తయారీసంస్థ పేర్కొంది. పంపిణీ 2026 తరువాత.. ప్రారంభమవుతుందని వివరించింది. సూపర్‌ సోనిక్ వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగిన నూతన యుద్ధ విమానం..ఐదో తరం యుద్ధ విమానాలకు చెందినదని అధికారులు చెప్పారు.

ఇదీ చదవండి: ప్రపంచంలోనే హైస్పీడ్​ రైలు- చైనా ఘనత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.