ETV Bharat / international

అంతా అమెరికానే చేసింది: రష్యా - పుతిన్ బైడెన్​ ఫోన్​కాల్​

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో తమ అధ్యక్షుడు పుతిన్​..​ ఫోన్​లో మాట్లాడాలన్న ప్రతిపాదనను అగ్రరాజ్యం తిరస్కరించిందని రష్యా దేశ విదేశాంగ శాఖ తెలిపింది. ఇరు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు వచ్చిన అవకాశాన్ని అమెరికానే కాలరాసిందని ఆరోపించింది.

Russia criticises US refusal to hold quick Putin-Biden call
అంతా అమెరికానే చేసింది: రష్యా
author img

By

Published : Mar 23, 2021, 9:20 AM IST

రష్యా, అమెరికా మధ్య విభేదాలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో​.. ఫోన్​లో మాట్లాడాలనే తమ అధ్యక్షుడు పుతిన్​ ప్రతిపాదనను శ్వేతసౌధం తిరస్కరించిందని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది. ఇటీవల పుతిన్​ ఉద్దేశించి 'కిల్లర్'​ అని బైడెన్​ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. బైడెన్​తో పుతిన్​ మాట్లాడాలనుకున్నారని పేర్కొంది.

"అమెరికా తప్పు వల్ల రష్యా- అమెరికా సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు వచ్చిన మరో అవకాశం చేజారిపోయింది. దీనికి పూర్తి బాధ్యత అమెరికాదే."

-రష్యా విదేశాంగ శాఖ.

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌కు నష్టం వాటిల్లే విధంగా రష్యా ప్రయత్నించినట్లు అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్‌ విభాగం ధ్రువీకరించిన నేపథ్యంలో.. జో బైడెన్ ఘాటగా‌ స్పందించారు. ఎన్నికల్లో తనను అణచివేసేందుకు చేసిన ప్రయత్నాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. వ్లాదిమిర్‌ పుతిన్‌ తన ప్రత్యర్థులతో క్రూరంగా ప్రవర్తిస్తాడని, అతనో 'కిల్లర్‌' అనే భావనను తాను కూడా నమ్ముతున్నట్లు ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:'పుతిన్, ఖమైనీ ఆదేశాలతోనే అమెరికా ఎన్నికల్లో జోక్యం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.