ETV Bharat / international

ఎదురుదెబ్బలు తిన్నా.. రెచ్చిపోవడమే రష్యా నైజం- ఉక్రెయిన్​లోనూ!

author img

By

Published : Mar 9, 2022, 12:25 PM IST

Russia attack on Ukraine: ఎదురుదెబ్బలు తిన్నప్పుడు మరింత రెచ్చిపోవడం రష్యా నైజం. ఆ దేశ సైనిక స్పందన విధ్వంసకరంగా ఉంటుంది. పుతిన్‌ సేనకు ఇది కొత్తేమీ కాదు.. వారి సైనిక వ్యూహ పత్రంలోని మూల సూత్రమే ఈ విధ్వంసం. చెచెన్యా, సిరియా విధ్వంసం ఉక్రెయిన్‌లో పునరావృతం అవుతోందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. అయితే, ఆ తరహా విధ్వంసానికి రష్యా ఇంకా దిగలేదని, రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలకు ఆస్కారం ఉండొచ్చని పేర్కొంటున్నారు.

Russia attack on Ukraine
ఉక్రెయిన్​

Russia attack on Ukraine: ప్రత్యర్థి పక్షం నుంచి ప్రతిఘటన ఎదురైనప్పుడు రష్యా సైనిక స్పందన విధ్వంసకరంగా ఉంటోంది. తనకు లొంగని నగరాలను, ప్రాంతాలను శ్మశానాలుగా మార్చేస్తోంది. సంయమనం కోల్పోయి పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాలను ప్రయోగిస్తోంది. భారీ శతఘ్నులతో, గగనతలం నుంచి విచ్చలవిడిగా బాంబుల వర్షం కురిపిస్తోంది. పుతిన్‌ సేనకు ఇది కొత్తేమీ కాదు.. వారి సైనిక వ్యూహ పత్రంలోని మూల సూత్రమే ఈ విధ్వంసం.

కొద్దిరోజులుగా ఉక్రెయిన్‌లోని ఖర్కివ్‌, మేరియుపొల్‌ తదితర నగరాలు, పట్టణాలు ఈ వినాశకర వ్యూహాన్ని చవిచూశాయి. ఆ ప్రాంతాలు శిథిలాల దిబ్బగా మిగిలిపోయాయి. ఆ దాడుల్లో పెద్ద సంఖ్యలో పౌరులూ ప్రాణాలు కోల్పోయారు. తనకు లొంగకుండా వీరోచితంగా పోరాడుతున్న కీవ్‌ నగరానికి, అక్కడి ప్రజలకు సందేశమివ్వడానికా అన్నట్లు పుతిన్‌ సేన రెచ్చిపోయింది. అయితే చెచెన్యా, సిరియాల్లో చేసిన తరహా విధ్వంసానికి రష్యా ఇంకా దిగలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రకారం చూస్తే రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలకు ఆస్కారం ఉండొచ్చని పేర్కొంటున్నారు.

గ్రోజ్నీ మూగ సాక్షి..

1990లలో చెచెన్యా.. రష్యాపై తిరుగుబాటు చేసింది. ఈ నేపథ్యంలో 1994-95లో రష్యా సైన్యం ఆ ప్రాంతంపై ఆక్రమణకు దిగింది. అయితే ఇరుకైన చెచెన్‌ రోడ్లపై రష్యా ట్యాంకులు తిరుగుబాటుదారులకు సులువైన లక్ష్యాలుగా మారాయి. పెద్దసంఖ్యలో ఆ శకటాలను ధ్వంసం చేశారు. దీనికి ప్రతిగా కొద్దివారాల పాటు శతఘ్నులు, వైమానిక దాడులతో రష్యా విరుచుకుపడింది. వీటి ధాటికి చెచెన్యా రాజధాని గ్రోజ్నీ శిథిలంగా మారింది. చెచెన్‌ ప్రతిఘటనకు కేంద్రబిందువుగా నిలిచిన మినుత్కా స్క్వేర్‌లో ఒకేరోజు గుక్క తిప్పుకోనివ్వకుండా వైమానిక దాడులకు రష్యా దిగింది. క్లస్టర్‌ బాంబులు ప్రయోగించింది. వీటికి తాళలేక పౌరులు సెల్లార్లలో దాక్కోవాల్సి వచ్చింది. నగరంలో వినాశనమే మిగిలింది.

Russia attack on Ukraine
చెచెన్యా రాజధాని గ్రోజ్నీ విధ్వంసం

సిరియాలోనూ

అంతర్యుద్ధంలో కూరుకుపోయిన సిరియాలోని బషర్‌ అల్‌ అసద్‌ ప్రభుత్వాన్ని రక్షించడానికి, ప్రపంచశక్తిగా తన హోదాను తిరిగి పొందడానికి 2015లో రష్యా తన సైనిక శక్తిని ప్రయోగించింది. పౌర ప్రాణనష్టం గురించి ఏ మాత్రం ఆలోచించకుండా యథేచ్ఛగా విధ్వంసానికి దిగిందన్న విమర్శలు ఉన్నాయి. సిరియాలోని అలెప్పో నగరం, తూర్పు ఘౌటా ప్రాంతాల్లో ఈ పరిస్థితులు ప్రబలంగా కనిపించాయి.

చుట్టుముట్టు.. విరుచుకుపడు..

సిరియాలోని తూర్పు ప్రాంతంలో అలెప్పో నగరం ఉంది. అప్పట్లో అది వివిధ తెగలకు చెందిన సాయుధ ముఠాల చేతిలో ఉండేది. 2016 చివర్లో ఈ నగరంపై రష్యా సైన్యం దాడి చేసింది. ఈ పోరులో రష్యా వ్యూహం ఒక్కటే! తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ప్రాంతాలను చుట్టుముట్టడం.. శతఘ్నులు, యుద్ధవిమానాలతో విరుచుకుపడటం!! వీటి ద్వారా తిరుగుబాటుదారులు, అక్కడ ఇంకా మిగిలి ఉన్న పౌరులను అలసిపోయేలా చేయడం!!! ఈ క్రమంలో పౌరులు భారీగా ప్రాణాలు కోల్పోయేవారు. రష్యా, ఇరాన్‌ నుంచి బయల్దేరిన వ్యూహాత్మక బాంబర్లు ఇందులో ముఖ్య పాత్ర పోషించాయి. ఈ విధ్వంస తాకిడికి అలెప్పో తలవంచక తప్పలేదు. అప్పటికి ఆ నగరంలో మిగిలిందేమీ లేదు. ప్రతి భవనమూ ఎంతో కొంత ధ్వంసమైంది. వీధులన్నీ శకలాలతో నిండిపోయి, గుర్తుపట్టలేకుండా తయారయ్యాయి.

ఇక్కడా అదే వ్యూహం..

తూర్పు ఘౌటా ప్రాంతంలోనూ రష్యా ఇదే వ్యూహానికి దిగింది. ఇది సిరియా రాజధాని డమాస్కస్‌ వెలుపల ఉంది. ఇది కొన్ని పట్టణాలు, వ్యవసాయ క్షేత్రాల సమూహం. మొదట్లో అక్కడ జరిగిన పోరులో తిరుగుబాటుదారులదే పైచేయిగా ఉంది. అయితే 2013లో అసద్‌ బలగాలపై దాడులు చేయరాదని అమెరికా నిర్ణయించింది. ఇది ఆయనకు కొంతమేర అనుకూలించింది. 2015లో రష్యా రంగప్రవేశం తర్వాత ఈ పోరు సమూలంగా మారిపోయింది. శతఘ్నులు, వైమానిక దాడులతో పుతిన్‌ సేన మోతెక్కించింది. వీటిని తప్పించుకోవడానికి తిరుగుబాటుదారులు సొరంగ మార్గాన్ని తవ్వారు. రష్యా బలగాల విధ్వంసక శక్తి ముందు ఈ వ్యూహాలేమీ పనిచేయలేదు. 2018లో ఆ ప్రాంతం రష్యాపరమైంది. డమాస్కస్‌ ఆక్రమణ కోసం తిరుగుబాటుదారులు సాగించిన యుద్ధానికీ ఇది ముగింపు పలికింది.

మార్పు లేదు..

చెచెన్యా, సిరియా యుద్ధం నాటితో పోలిస్తే రష్యా సైన్యం మారి ఉంటుందని, ఒకింత ప్రొఫెషనల్‌గా తయారై ఉంటుందని కొందరు సైనిక విశ్లేషకులు.. ఉక్రెయిన్‌ యుద్ధానికి ముందు భావించారు. అయితే వారి పద్ధతి మారలేదని క్షేత్ర స్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధంలో సరకులు, ఆయుధ సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు, క్షేత్రస్థాయి తప్పిదాలు, పోరాటానికి విముఖంగా ఉన్న యువ సైనికులు.. వంటి లోపాలు రష్యా సైన్యంలో ప్రస్ఫుటంగా కనిపించాయి. వీటిని కప్పి పుచ్చుకోవడానికి భారీ శతఘ్నులు, యుద్ధవిమానాలు, బాంబర్లపై ఆధారపడుతోందన్న విమర్శలు ఉన్నాయి.

ఇదీ చూడండి: నీరే అగ్గి రాజేసింది.. ఉక్రెయిన్‌తో రష్యా వివాదానికి కారణం ఇదేనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.