ETV Bharat / international

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు 'కౌంటర్​ టెర్రరిజం'

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కౌంటర్​ టెర్రరిజం ఆపరేషన్​ సెంటర్(సీటీఓసీ)​ని ఏర్పాటు చేయనుంది బ్రిటన్. ఇందుకు సంబంధించిన నిధులను సమకూర్చుతున్నట్లు యూకే ఛాన్సలర్​ రిషి సునక్​ తెలిపారు.

author img

By

Published : Nov 26, 2020, 1:46 PM IST

Rishi Sunak allocates funds for UK's new Counter Terrorism Operations Centre
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 'సీటీవోసీ'

ప్రపంచదేశాలకు ముప్పుగా మారిన తీవ్రవాదానికి వ్యతిరేకంగా లండన్​లో కౌంటర్​ టెర్రరిజం ఆపరేషన్​ సెంటర్​(సీటీఓసీ)ను ఏర్పాటు చేయనుంది యూకే ప్రభుత్వం. ఈ మేరకు పెద్దమొత్తంలో నిధులను కూడా సీటీఓసీకి కేటాయించనున్నట్లు యూకే ఛాన్సెలర్​ రిషి సునక్​ స్పష్టం చేశారు.

వచ్చే ఏడాదికి గానూ బ్రిటీష్​ పార్లమెంట్​లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్​ బిల్లులో అదనంగా నాలుగు వేల కోట్ల రూపాయిలను కేటాయించారు. ఈ మొత్తాన్ని అక్కడి ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో ఖర్చు పెట్టనుంది. దీనితో పాటే సీటీఓసీ నిర్మాణం జరగనుంది. ఇందులో భాగంగా 2023 లోగా మరో 20వేల మంది పోలీసులను నియమించుకోవాలని యోచిస్తోంది.

ఉగ్రవాదం నుంచి మనందరిని రక్షించడానికి పోలీసులు, ఇంటెలిజెన్స్​ వ్యవస్థలు రోజూ అసాధారణమైన కృషి చేస్తున్నాయి. ప్రపంచ భాగస్వాములను ఒకేతాటి పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా మనం తీవ్రవాదులకు గట్టి సందేశం పంపవచ్చు. సీటీఓసీ కొత్త భవనం వచ్చే ఏడాది ప్రారంభంలో పూర్తయ్యే అవకాశం ఉంది.

- రిషీ శునక్​ యూకే ఛాన్స్​లర్​

ఇదీ చూడండి: మహిళా ప్రాజెక్టులకు ప్రోత్సాహకంగా భారీగా నిధులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.