ETV Bharat / international

కశ్మీర్​పై ఐరాస వేదికగా పాక్​కు భారత్​ కౌంటర్​ - ఐరాస వేదికగా పాకిస్థాన్​కు భారత్ జవాబు

జమ్ము కశ్మీర్​లో ప్రజాస్వామ్యాన్ని అట్టడుగు స్థాయి నుంచి పునరుద్ధరించినట్లు భారత్ పేర్కొంది. పొరుగుదేశం ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తోందని పాక్​ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఉగ్రవాదులకు కేంద్ర బిందువు పాకిస్థానే అని స్పష్టం చేసింది. అలాంటి దేశం మానవ హక్కుల ప్రసంగాలు చేయడంపై మండిపడింది.

revived-grass-root-democracy-in-j-k-despite-attempts-by-a-country-to-derail-the-process-india-at-45th-session-of-human-rights-council-geneva-un
కశ్మీర్​పై ఐరాస వేదికగా పాక్​కు భారత్​ పంచ్​
author img

By

Published : Sep 16, 2020, 5:34 AM IST

జమ్ము కశ్మీర్​లో అట్టడుగు స్థాయి నుంచి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించినట్లు ఐక్యరాజ్యసమితి(ఐరాస) వేదికగా భారత్ ఉద్ఘాటించింది. తద్వారా ఆర్థిక, సామాజిక అభివృద్ధికి నూతన వేగాన్ని అందించినట్లు పేర్కొంది. ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి పాకిస్థాన్ నిరంతరం ఉగ్రవాదులను ఎగదోస్తోందని ఆక్షేపించింది.

ఈ మేరకు ఐరాస మానవ హక్కుల మండలి 45వ సమావేశంలో ప్రసంగించిన భారత శాశ్వత ప్రతినిధి ఇంద్రామణి పాండే.. మానవ హక్కులను కాపాడేందుకు భారత్ పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోని ప్రజలు భారతీయులందరితో సమానంగా ప్రాథమిక హక్కులు అనుభవిస్తున్నారని తెలిపారు.

"కొవిడ్-19 సహా మా ప్రక్రియను అడ్డుకునేందుకు ఓ దేశం(పాకిస్థాన్​ను ఉద్దేశించి) నిరంతర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. జమ్ము కశ్మీర్​లో అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. గత ఏడాది కాలంగా ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో ఎనలేని పురోగతి లభించింది. జమ్ము కశ్మీర్​లోని అన్ని వర్గాల ప్రజలకు సామాజిక, ఆర్థిక న్యాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది."

-ఇంద్రామణి పాండే, ఐరాస మానవ హక్కుల మండలిలో భారత శాశ్వత ప్రతినిధి

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మానవ హక్కుల పరిరక్షణకు భారత్​ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు పాండే. జమ్ము కశ్మీర్​ గురించి మానవ హక్కుల మండలి చీఫ్ మిషెల్ బచెలెట్ ప్రస్తావించడంపై విచారం వ్యక్తం చేశారు.

పాక్​కు పంచ్

అదేసమయంలో పాకిస్థాన్​ తీరును ఐరాసలోని భారత ప్రతినిధులు ఎండగట్టారు. ఉగ్రవాదానికి కేంద్ర బిందువు పాకిస్థానే అని.. అలాంటి దేశం మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రసంగాలు చేస్తోందని ఎద్దేవా చేశారు. హానికరమైన ప్రయోజనాల కోసం తప్పుడు కథనాలతో భారత ప్రతిష్ఠకు భంగం కలిగించడం పాకిస్థాన్​కు అలవాటుగా మారిందని మండిపడ్డారు.

"మతపరమైన మైనారిటీలను వివక్షకు గురిచేస్తున్న దేశం నుంచి మానవ హక్కుల ప్రసంగాలను భారతదేశమే కాదు ప్రపంచంలోని ఏ ఒక్కరూ వినేందుకు అర్హులు కాదు. ఐరాస నిషేధిత జాబితాలో ఉన్న వ్యక్తులకు పెన్షన్లు అందించడం, జమ్ము కశ్మీర్​లో పోరాడేందుకు తమ దేశంలో వేల సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నారని ఒప్పుకునే ప్రధాని ఉండటం ఆ దేశ ప్రత్యేకత."

-ఐరాసలో భారత ప్రతినిధులు

పాత్రికేయులు, మానవ హక్కుల కార్యకర్తలపై పాకిస్థాన్ దాడులు, బెదిరింపులకు పాల్పడుతోందని భారత దౌత్యవేత్తలు పేర్కొన్నారు. బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాల్లో పాక్ భద్రత దళాలు తమ పౌరులనే అపరణకు గురిచేస్తున్నాయని అన్నారు. ఐరాస మానవ హక్కుల మండలి వంటి వేదికలను పాకిస్థాన్ దుర్వినియోగం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

టర్కీ, ఐఓసీకి కౌంటర్

మరోవైపు ఇస్లామిక్ సహకార సంస్థ(ఓఐసీ) జమ్ము కశ్మీర్​ ప్రస్తావన తీసుకురావడాన్ని సైతం భారత ప్రతినిధులు వ్యతిరేకించారు. భారత అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడే అర్హత ఓఐసీకి లేదని తేల్చిచెప్పారు. ​పాకిస్థాన్ తన సొంత అజెండా కోసమే ఈ అంశాలను ప్రతిపాదిస్తోందని.. వీటిని అనుమతించే విచక్షణ పూర్తిగా ఓఐసీ సభ్యులకే వదిలేస్తున్నట్లు స్పష్టం చేశారు.

మరోవైపు భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలని టర్కీకి హితవు పలికింది భారత్. ప్రజాస్వామ్య విధానాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలని స్పష్టం చేసింది.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.