ETV Bharat / international

రష్యా అధ్యక్షునిగా కొనసాగేందుకు పుతిన్​కు లైన్​ క్లియర్! - రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​ మరో దఫా అధికారంలో కొనసాగేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు మరోమారు అధ్యక్ష పదవి పుతిన్ చేపట్టేలా రాజ్యాంగ సవరణ చేయాలని చట్టసభ సభ్యురాలు వాలెంటైనా తెరిస్కోవా ప్రతిపాదించిన తీర్మానాన్ని స్టేట్ డ్యూమా 382-0 ఓట్ల తేడాతో ఆమోదించింది.

Putin backs amendment allowing him to remain in power
రష్యా అధ్యక్షునిగా కొనసాగేందుకు పుతిన్​కు లైన్​ క్లియర్!
author img

By

Published : Mar 11, 2020, 5:56 AM IST

Updated : Mar 11, 2020, 7:07 AM IST

రష్యా అధ్యక్షునిగా కొనసాగేందుకు పుతిన్​కు లైన్​ క్లియర్!

రష్యా అధ్యక్షుడిగా తన అధికారాన్ని మరోసారి కొనసాగించుకునేందుకు మార్గం సుగమం చేసుకున్నారు వ్లాదిమిర్ పుతిన్. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలంటూ చట్టసభసభ్యురాలైన వాలెంటీనా తెరిస్కోవా ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతుగా నిలిచి.. డ్యూమా(దిగువసభ)లో ఆమోదం పొందేలా చేసుకున్నారు.

తెరిస్కోవా ప్రతిపాదన... ఆమోదం

1963లో సోవియట్ రష్యా వ్యోమగామిగా... అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి మహిళ వాలెంటినా తెరిస్కోవా. ప్రస్తుతం ఆమె రష్యా చట్టసభ సభ్యురాలిగా ఉన్నారు.

రష్యా అధ్యక్ష పదవిలో వరుసగా రెండు దఫాలకు మించి ఉండరాదన్న పరిమితిని రద్దు చేయాలని, లేదా ఆ నియమాన్ని పూర్తిగా (రీసెట్​) ప్రక్షాళించాలంటూ తెరిస్కోవా ప్రతిపాదించారు. క్రెమ్లిన్ నియంత్రిత దిగువ సభ స్టేట్ డ్యూమా... తెరిస్కోవా ప్రతిపాదించిన సవరణలను 382-0 ఓట్ల తేడాతో ఆమోదించింది. అలాగే పుతిన్ ప్రతిపాదించిన రాజ్యాంగ మార్పులకూ ఆమోదం తెలిపింది. అయితే ఈ సభకు 44 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. ఈ రాజ్యాంగ సవరణ ఆమోదం పొందినందున.. పుతిన్ ఇప్పటివరకు 4 సార్లు అధ్యక్ష పదవి చేపట్టిన లెక్క పరిగణనలోకి రాదు. ఈ సవరణలపై ఏప్రిల్ 22న దేశవ్యాప్తంగా ఓటింగ్ నిర్వహిస్తారు.

పుతిన్​ ప్రస్తుత ఆరేళ్ల పదవీ కాలం 2024తో ముగియనుంది. తాజాగా రాజ్యాంగ సవరణ కూడా ఆమోదం పొందిన నేపథ్యంలో... తరువాతి ఎన్నికల్లో కూడా పోటీ చేసి అధికారం చేజిక్కించుకునేందుకు ఆయనకు అవకాశం లభించింది.

పరిమితి రద్దుకు ససేమిరా!

పుతిన్​ శాసనసభలో మాట్లాడుతూ, అధ్యక్ష పదవీ కాల పరిమితులను పూర్తిగా రద్దు చేసే ప్రతిపాదనను వ్యతిరేకించారు. అయితే అధ్యక్ష పదవికి రెండేళ్ల పరిమితి అనే నియమం 2024 నుంచి మాత్రమే వర్తిస్తున్న ప్రతిపాదనకు మద్దతుగా నిలిచారు.

స్టాలిన్ తరువాత..

67 ఏళ్ల పుతిన్​ 20 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నారు. సోవియట్ నియంత జోసెఫ్ స్టాలిన్ తరువాత రష్యా అధ్యక్షుడిగా ఎక్కువ కాలం పనిచేసిన నాయకుడిగా అవతరించారు.

ఇదీ చూడండి: వుహాన్​లో తొలిసారి పర్యటించిన జిన్​పింగ్​

Last Updated : Mar 11, 2020, 7:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.