కరోనా వైరస్‌పై ఓ సరికొత్త అధ్యయనాన్ని ప్రారంభించారు లండన్ సైకాలజిస్టులు. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి మానసిక స్థితి , అతడిపై సామాజిక ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నారు.
వైరస్ సోకడం వల్ల సదరు వ్యక్తి ఇతరులతో ఎలా ప్రవర్తిస్తాడు? అతని ఆలోచన విధానం ఎలా ఉంటుంది? వంటి పలు విషయాలపై స్పష్టత కోసం ఈ అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు పరిశోధకులు. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ప్రజారోగ్య సమస్యలను ఎదుర్కొనడానికి సన్నద్ధంగా ఉండొచ్చని చెప్పారు. బాధితుల మానసిక స్థితి ఆధారంగా వైరస్ వృద్ధి, వ్యాప్తి ఎలా చెందుతుందో తెలుస్తుందని వివరించారు.
షఫ్ఫీల్డ్ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ రిచార్డ్ బెంటాల్ నేతృత్వంలో ఈ పరిశోధన జరుగుతోంది. ప్రస్తుతం 2వేల మందిపై ఈ అధ్యయనం చేసినట్లు పరిశోధకులు తెలిపారు. ఓ నెల వ్యవధిలో వీరి పై మరోసారి పరిశోధన చేయనున్నట్లు వెల్లడించారు. రెండు విడతలుగా ఈ అధ్యయనం చేయడం మరింత మెరుగైన ఫలితాలు వెలువడుతాయని తెలిపారు.
ఇదీ చూడండి : కాబుల్‌లో గురుద్వారాపై ఉగ్రదాడి- 11 మంది మృతి