ETV Bharat / international

'సైకో' ఉడత బీభత్సం.. ఊరంతా భయంభయం.. చివరకు మరణ శిక్ష! - trending news

Psycho squirrel: ఓ ఉడత 'సైకో'లా మారింది. పట్టణంలోని ప్రజలందరినీ హడలెత్తించింది. రెండు రోజుల్లో 18 మందిని గాయపరిచింది. చివరకు.. మరణ శిక్షను ఎదుర్కొంది. ఇదంతా ఎక్కడంటే...

Psycho squirrel, సైకో ఉడత
'సైకో' ఉడత బీభత్సం
author img

By

Published : Dec 30, 2021, 8:07 PM IST

Psycho squirrel: అది 2021 మార్చి.. బ్రిటన్​ ఫ్లింట్​షైర్​లోని బక్లీ పట్టణం.. కొరిన్ రెనాల్డ్స్​ అనే మహిళ పెరట్లోని తన పెంపుడు పక్షులకు మేత వేస్తోంది. అప్పుడే ఆమెకు ఓ ఉడత కనిపించింది. పక్షుల మేతను 'దొంగిలించి' కడుపు నింపుకునేందుకు వచ్చిందది. పోనీలే పాపమని.. ఆ ఉడతకూ రోజూ మేత వేయడం మొదలుపెట్టింది కొరిన్. అలా వారి మధ్య స్నేహం కుదిరింది. ఆ ఉడత ఏ మాత్రం భయపడకుండా కొరిన్ చేతిపై ఎక్కి, ఆహారం తీసుకునేంతగా చనువు పెరిగింది.

కానీ.. గత వారం, క్రిస్మస్​కు కొద్దిరోజుల ముందు అనూహ్య ఘటన జరిగింది. ఆహారం అందిస్తున్న కొరిన్​ చేతిని కరిచి పారిపోయింది ఆ ఉడత. ఇలా ఎందుకు అయిందా అని అనుకుంటున్న ఆమెకు.. కొన్ని ఫేస్​బుక్​ పోస్టులు చూడగానే భయమేసింది.

ఆ పోస్టుల్లో ఏముంది?

కొరిన్ కంటపడ్డ ఫేస్​బుక్ పోస్టులన్నీ ఆ ఉడత గురించే. అందరిదీ ఒకటే ఫిర్యాదు.. ఉడత కరిచిందని. "హెచ్చరిక. మనుషులపై దాడి చేసే దుష్ట ఉడతతో జాగ్రత్తగా ఉండండి. ఆ ఉడత నన్ను, నా ఫ్రెండ్​ను, మరెంతో మందిని కరిచింది. మా పిల్లులపైనా దాడి చేసింది. ఎవరూ ఇంటి నుంచి బయటకు వెళ్లకండి" అని ఈనెల 26న బక్లీ వాసుల ఫేస్​బుక్ గ్రూప్​లో పోస్ట్ చేసింది నికోలా క్రౌథర్ అనే మహిళ.

షెరీ డేవిడ్​సన్​దీ అదే కథ. పదునైన పళ్లతో తన చేతిపై గట్టిగా కరిచిందని చెప్పింది షెరీ. ఇలా ఒకరిద్దరు కాదు.. రెండు రోజుల్లో 18 మందిని.. తల నుంచి పాదాల వరకు ఎక్కడపడితే అక్కడ కరిచింది ఆ ఉడత. పిల్లలు, పెద్దలు అందరూ బాధితులే. సుమారు 16వేల మంది జనాభా ఉండే బక్లీలో క్రిస్మస్ వేళ ఇదే హాట్​ టాపిక్. అంతా కలిసి ఆ ఉడతకు స్ట్రైఫ్​ అని నామకరణం కూడా చేశారు. గ్రెమ్లిన్స్ సినిమాలో విలన్ పేరది.

ప్రేమను నటించి, పట్టేసిన కొరిన్..

పరిస్థితి ఇలానే కొనసాగితే కష్టమనుకుంది కొరిన్ రెనాల్డ్స్​. తాను ఏదొ ఒకటి చేయాలని అనుకుంది. రోజూ ఆహారం వేసే చోట ఉచ్చు పెట్టింది. ఓ 20 నిమిషాలు అక్కడే ఉండి ఉడతకు మేత వేసింది. అంతే.. అనుకున్నది అయింది. 'సైకో' ఉడత.. ఉచ్చులో పడింది.

చట్టం అడ్డొచ్చింది...

కొరిన్​ బంధించిన ఉడతను.. 'ద రాయల్ సొసైటీ ఫర్ ద ప్రివెన్షన్​ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్' సంస్థ స్వాధీనం చేసుకుంది. దానిని తీసుకెళ్లి దూరంగా అడవిలో వదిలేద్దామని ఆ సంస్థ వారు అనుకున్నా... చట్టం అడ్డొచ్చింది. 2019లో చేసిన ఆ చట్టం ప్రకారం.. గ్రే రంగు ఉడతల్ని తీసుకెళ్లి అడవుల్లో విడిచిపెట్టడం నేరం మరి!

"ఈ చట్టంతో మేము ఏకీభవించడం లేదు. కానీ.. పాటించి తీరాలి. అందుకే ఆ ఉడతను చంపడం తప్ప మాకు మరో మార్గం లేదు" అని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
చివరకు.. ఓ పశు వైద్యుడు ఇంజెక్షన్ చేసి ఆ ఉడతకు 'కారుణ్య మరణం'(యూథనేష్యా) ప్రసాదించారు.

నమ్మక ద్రోహం చేశా...

అనేక నెలలు ఉడతతో స్నేహం చేసిన కొరిన్.. విషాదంలో మునిగిపోయింది. "ఆ ఉడత నన్ను నమ్మింది. కానీ.. నేను మోసం చేశా" అని వాపోయింది.

ఇదీ చదవండి: ఒమిక్రాన్​తో కరోనా కేసుల సునామీ: డబ్ల్యూహెచ్ఓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.