ఇటలీ కాంపేనియా గవర్నర్ విన్సెంజో డి లూకా.. నప్లాస్ నగరంలో లాక్డౌన్ ఆంక్షలను విధిస్తారనే వార్తల వల్ల స్థానికులు ఆందోళనలు చేపట్టారు. పోలీసుల పైకి రాళ్లు, పొగ బాంబులను విసిరారు. ఫలితంగా నిరసనకారులను అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.
కరోనా కట్టిడి దిశగా అధికారులు తీసుకోవాలనుకున్న నిర్ణయం.. నిరసనలు తీవ్రరూపం దాల్చేలా చేశాయని స్థానిక మీడియా తెలిపింది. గతంలో విధించిన ఆంక్షలు కారణంగా ఆ ప్రాంతంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. తిరిగి లాక్డౌన్ పెడతారనే పుకార్ల వల్ల ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు.
ఇటలీలో కరోనా కారణంగా ఇప్పటి వరకు 37 వేల మందికి పైగా మరణించారు.
ఇదీ చూడండి: హైతీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన ప్రజలు