బ్రిటన్లో ఖలిస్థాన్ మద్దతుదారులు రెచ్చిపోయారు. లండన్లోని భారత హైకమిషనర్ కార్యాలయం దగ్గరున్న ఎన్ఆర్ఐలపై దాడికి యత్నించారు. ఆ ప్రాంగణమంతా ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో పలువురు భారతీయులకు గాయాలయ్యాయి.
దాడికి పాల్పడ్డవారు సిక్కు తలపాగా ధరించి ఉన్నారు. ఉర్దూలో నినాదాలు చేశారు. వీరి వెనుక ఐఎస్ఐ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.