భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్‌కు బ్రిటన్‌లో అరుదైన గౌరవం దక్కింది. ఆ దేశ హోంమంత్రిగా ప్రీతి బాధ్యతలు చేపట్టారు. ఓ భారతీయ సంతతి వ్యక్తి ఈ పదవిని చేపట్టడం ఇదే తొలిసారి. బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. గుజరాత్‌కు చెందిన ప్రీతి పటేల్‌కు బోరిస్ మంత్రివర్గంలో హోంమంత్రి భాధ్యతలు అప్పగించారు.
గతంలో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పాకిస్థాన్ సంతతికి చెందిన సాజిద్ జావిద్ స్థానాన్ని భర్తీ చేశారు పటేల్. నూతన మంత్రివర్గంలో జావిద్ ఖజానా శాఖ మంత్రిగా నియమితులయ్యారు.
భద్రంగా... సురక్షితంగా
బ్రిటన్‌ను భద్రంగా, సురక్షితంగా ఉంచేందుకు కృషి చేస్తానని ప్రకటించారు ప్రీతి పటేల్. తన ముందున్న సవాళ్లను అధిగమిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
బ్రిటన్ నూతన ప్రధాని బోరిస్ జాన్సన్‌కు మద్దతుగా కన్సర్వేటివ్ పార్టీ నిర్వహించిన 'బ్యాక్ బోరిస్' ప్రచార కార్యక్రమంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు ప్రీతి. మంత్రివర్గంలో ఆమెకు కీలక పదవి దక్కుతుందని ముందునుంచే ఊహాగానాలున్నాయి.
ఆధునిక బ్రిటన్, ఆధునిక కన్సర్వేటివ్ పార్టీని ప్రతిబింబించేలా మంత్రివర్గం ఉండాలని బుధవారం తనకు పదవి కేటాయిచంకముందు తెలిపారు ప్రీతి.
కీలక పదవులు...
ఎస్సెక్స్‌లోని విథమ్ నియోజకవర్గం నుంచి 2010లో తొలిసారి కన్సర్వేటివ్ పార్టీ ఎంపీగా ఎన్నికయ్యారు ప్రీతి పటేల్.
2014లో ఖజానా శాఖ, 2015 సాధారణ ఎన్నికల అనంతరం ఉపాధి శాఖలకు సహాయ మంత్రిగా సేవలందించారు.
బ్రిటన్ ప్రజల అంచనాలను జాన్సన్ అందుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రీతి.
ఇదీ చూడండి: బ్రిటన్ ప్రధానిగా బోరిస్ బాధ్యతల స్వీకరణ