అధ్యక్ష ఎన్నికలు ముగిసిన గంటల వ్యవధిలోనే ఐరోపా దేశం బెలారస్‌లో హింస ప్రజ్వరిల్లింది. ప్రస్తుత అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషింకో... అధికార దుర్వినియోగానికి పాల్పడి మరోమారు ఎన్నికయ్యేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ నిరసనకారులు ఆందోళనకు దిగారు.
![Police, protesters clash after Belarus presidential vote](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8360386_gkhjk.jpg)
రాజధాని మిన్‌స్క్ సహా బ్రెస్ట్ నగరంలో ఒక్కసారిగా ఆందోళనలు మిన్నంటాయి. ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పలు చోట్ల పోలీసులతో ఘర్షణకు దిగారు. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు వాటర్ కేనన్‌లు, బాష్ప వాయువును ప్రయోగించారు.
![Police, protesters clash after Belarus presidential vote](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8360386_guiiiiii.jpg)
![Police, protesters clash after Belarus presidential vote](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8360386_pollu.jpg)
ఇదీ చూడండి: పార్టీలో కాల్పులు- ఒకరు మృతి, 20 మందికి గాయాలు