పోలాండ్లో దేశ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలో కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో ఓటర్లు మాస్క్లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఎన్నికల అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్యాలెట్లను క్రమం తప్పకుండా శానిటైజ్ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెంటిలేషన్ ఉండేలా ఏర్పాట్లు చేశారు.



హోరాహోరీగా సాగుతోన్న ఈ ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున ఆండ్రేజ్ డూడా, ప్రధాన ప్రతిపక్షం సివిక్ ప్లాట్‌ఫాం పార్టీ తరఫున వార్సా మేయర్ రాఫల్ ట్రజాస్కోవ్స్కీ రేసులో ఉన్నారు.


దేశంలో ఇప్పటికే 37,000 మందికి పైగా వైరస్ బారినపడ్డారు. దాదాపు 1,600 మంది మరణించారు.


ఇదీ చూడండి: మలాలా డే: విద్యలో లింగ సమానత్వం ఇంకెప్పుడు?