ఐదు రోజులపాటు ఇటలీ, బ్రిటన్లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మంగళవారం తిరిగి భారత్కు పయనమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా.. ఆయన జీ20 సదస్సు, కాప్26 ప్రపంచ వాతావరణ సదస్సుల్లో పాల్గొన్నారు.
"భూమి భవిష్యత్తు గురించి రెండు రోజులపాటు జరిగిన తీవ్రమైన చర్చల తర్వాత గ్లాస్గో నుంచి బయలుదేరాను. పారిస్ ఒప్పందంలోనీ తీర్మానాలకు భారత్ కట్టుబడి ఉండటమే గాకుండా.. రానున్న 50 ఏళ్ల కోసం ప్రతిష్ఠాత్మక ఎజెండాను ఏర్పాటు చేసుకుంది" అని మోదీ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
గ్లాస్గోలోని హోటల్ నుంచి బయలుదేరే ముందు మోదీ.. అక్కడకు చేరుకున్న చిన్నారులతో ముచ్చటించారు. ప్రవాస భారతీయులతో కలిసి ఆయన సరదాగా డోలు మోగించారు. అనంతరం ఆయనకు వారు వీడ్కోలు పలికారు.
-
#WATCH PM Modi plays the drums along with members of the Indian community gathered to bid him goodbye before his departure for India from Glasgow, Scotland
— ANI (@ANI) November 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
(Source: Doordarshan) pic.twitter.com/J1zyqnJzBW
">#WATCH PM Modi plays the drums along with members of the Indian community gathered to bid him goodbye before his departure for India from Glasgow, Scotland
— ANI (@ANI) November 2, 2021
(Source: Doordarshan) pic.twitter.com/J1zyqnJzBW#WATCH PM Modi plays the drums along with members of the Indian community gathered to bid him goodbye before his departure for India from Glasgow, Scotland
— ANI (@ANI) November 2, 2021
(Source: Doordarshan) pic.twitter.com/J1zyqnJzBW
పర్యటనలో భాగంగా... వివిధ దేశాధినేతలతో మోదీ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. ఇటలీలోని రోమ్ నగరంలో జీ20 సదస్సు జరగగా... స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా కాప్26 భేటీ జరిగింది.
ఇవీ చూడండి: