ETV Bharat / international

G20 Summit 2021: అగ్రదేశాధినేతలతో మోదీ మాటామంతీ.. బైడెన్​తో సరదాగా..

జీ-20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా అగ్రదేశాల అధినేతలను కలిశారు ప్రధాని నరేంద్ర మోదీ. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో ఆహ్లాదంగా ముచ్చటించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్​తోనూ ఆప్యాయంగా మాట్లాడారు.

PM Modi interacts with President Biden and other world leaders at G20 Summit
బైడెన్​తో మోదీ మాటామంతీ
author img

By

Published : Oct 30, 2021, 7:47 PM IST

ఇటలీ రాజధాని రోమ్​ వేదికగా జరుగుతున్న జీ-20 శిఖరాగ్ర సదస్సులో అగ్రదేశాల అధినేతలను కలిశారు ప్రధాని నరేంద్రమోదీ. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో సరదాగా సంభాషించారు. ఇరుదేశాధినేతలు భుజాలపై చేతులు వేసుకుని నడుస్తూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. వీరి ఆసక్తికర సంభాషణ తొలిరోజు సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్​ మేక్రాన్​ను ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా పలకరించారు మోదీ. ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. వీరే గాక బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్​, కెనడా ప్రధాని జస్టిన్​ ట్రుడో, సింగపూర్ ప్రధాని లీ సైన్ లూంగ్​తోనూ మోదీ మాట్లాడారు.

ప్రపంచంలోని ఆర్థిక దిగ్గజ దేశాధినేతలు కొవిడ్‌ తర్వాత తొలిసారి జీ-20 సదస్సులో భాగంగా ఇటలీలో సమావేశమయ్యారు. వాతావరణ మార్పులు, కొవిడ్‌ తర్వాత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ప్రపంచస్థాయిలో కనీస కార్పొరేట్‌ ట్యాక్స్‌ వంటి అజెండా అంశాలపై చర్చించనున్నారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ.. సదస్సు వేదిక వద్ద జీ-20 దేశాధినేతలకు స్వాగతం పలికారు. సదస్సు ప్రారంభ సెషన్‌లో ప్రపంచ ఆరోగ్యం, ఆర్థికవ్యవస్థపై జీ-20 దేశాధినేతలు దృష్టి సారించారు. ఈ సందర్భంగా కీలక దేశాధినేతలు ఇరాన్‌ అణు కార్యక్రమంపై తదుపరి చర్యలకు సంబంధించి కూడా చర్చించనున్నారు. జీ-20 సదస్సు భేటీ తర్వాత చాలామంది దేశాధినేతలు ఐరాస నిర్వహించే వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గోకు వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొంటారు.

ఇదీ చదవండి: 'ప్రవాస భారతీయులతో సంభాషణ గొప్పగా జరిగింది'

For All Latest Updates

TAGGED:

g20 summit
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.