ETV Bharat / international

యాంటీబాడీలు తగ్గుతున్నా.. వైరస్‌ నుంచి రక్షణ! - ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌

కరోనా టీకా తీసుకున్న తర్వాత 2 నుంచి 3 నెలల్లో ప్రతిరక్షకాల స్థాయి కాస్త తగ్గుతున్నట్లు ఇటీవలే ఓ నివేదిక వెల్లడించింది. అయినప్పటికీ ప్రమాదమేమీ లేదని, రోగనిరోధక మెమొరీ వ్యవస్థ వల్ల వైరస్ నుంచి రక్షణ ఉంటుందని తెలిపింది.

antibody levels
యాంటీబాడీలు
author img

By

Published : Jul 27, 2021, 5:52 PM IST

కరోనా వైరస్‌ను పూర్తిస్థాయిలో ఎదుర్కొనేందుకు శరీరంలో సరైన మోతాదులో యాంటీబాడీలు వృద్ధి చెందడమే అత్యంత కీలకం. వైరస్‌ బారినపడి కోలుకోవడం ద్వారా లేదా వ్యాక్సిన్‌ పొందడం వల్ల ఇవి వృద్ధి చెందుతాయి. అయితే, ఇవి శరీరంలో ఎంతకాలం ఉంటాయనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత 2 నుంచి 3 నెలల్లో యాంటీబాడీల స్థాయి కాస్త తగ్గుతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. లండన్‌ పరిశోధకులు జరిపిన ఈ అధ్యయన నివేదిక ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ 'ది లాన్సెట్‌'లో ప్రచురితమయ్యింది.

శరీరంలో కొవిడ్‌ను ఎదుర్కొనే యాంటీబాడీల స్థాయిలను అంచనా వేసేందుకు యూనివర్సిటీ కాలేజీ లండన్‌ (యూసీఎల్) పరిశోధకులు ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌లు తీసుకున్న 600మందిపై అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా వ్యాక్సిన్‌ తీసుకున్న ఆరు వారాల అనంతరం వారిలో యాంటీబాడీల స్థాయిలు తగ్గుతుండగా.. 10 వారాల తర్వాత దాదాపు 50శాతానికి పడిపోతున్నట్లు గుర్తించారు. అయినప్పటికీ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వ్యాక్సిన్‌లు సమర్థంగానే పనిచేస్తున్నాయని నిపుణులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బూస్టర్‌ డోసు అవసరాన్ని పరిశోధకులు నొక్కిచెప్పారు. ఈ అధ్యయనానికి కొన్ని పరిమితులు ఉన్నాయన్న పరిశోధకులు, తక్కువ సంఖ్యలో నమూనాలను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. ఈ ఫలితాలను నిర్ధరించేందుకు మరింత అధ్యయనం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అయితే, యాంటీబాడీల ప్రతిస్పందనలు ఒక్కో వ్యక్తిలో ఒక్కో విధంగా ఉంటాయని.. వారిలోని టీ-కణాల ప్రతిస్పందనలు కూడా వేరుగా ఉంటాయని గుర్తు చేశారు. యాంటీబాడీల స్థాయిలు తగ్గుతున్నప్పటికీ.. రోగనిరోధక మెమొరీ వ్యవస్థ వల్ల కొవిడ్‌ నుంచి రక్షణ ఉంటుందని పేర్కొన్నారు.

టీకాలు తీసుకున్న వారిలోనే ఎక్కువ యాంటీబాడీలు..

వైరస్‌ నుంచి కోలుకున్నవారిలో వృద్ధి చెందే యాంటీబాడీలతో పోలిస్తే వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్లే ఎక్కువ యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఫైజర్‌ లేదా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తీసుకున్న వెంటనే యాంటీబాడీలు గణనీయంగా పెరుగుతూ కొవిడ్‌ నుంచి రక్షణ కల్పిస్తున్నాయని యూసీఎల్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌ ఇన్ఫర్మాటిక్స్‌కు చెందిన డాక్టర్‌ మధుమిత శ్రోత్రి పేర్కొన్నారు. కానీ, టీకా తీసుకున్న రెండు, మూడు నెలల తర్వాత ఇవి తగ్గిపోవడాన్ని గమనించామన్నారు. అయినప్పటికీ కొవిడ్‌-19 నుంచి వ్యాక్సిన్‌లు పూర్తి రక్షణ కల్పిస్తున్నాయని చెప్పారు.

ఇదీ చూడండి: జంట యాంటీబాడీలతో కొత్త వేరియంట్లకు చెక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.