పాస్‌పోర్టు సూచీలో జపాన్, సింగపూర్ ప్రథమ స్థానంలో నిలిచాయి. దక్షిణ కొరియా, జర్మినీ ద్వితీయ స్థానం పొందాయి. 'హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్'లో (Henley Passport Index 2021) భారత పాస్‌పోర్టు స్కోరు గత ఏడాది 84 కంటే ఆరు స్థానాలు తగ్గిపోయి 90కి పరిమితమైంది. ప్రయాణాలకు అత్యంత స్నేహపూరితంగా ఉండేలా పాస్‌పోర్టులు ఇచ్చే దేశాలను ఈ సూచీలో పేర్కొంటారు. దాదాపు రెండేళ్లుగా అమల్లో ఉన్న అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల్ని వివిధ దేశాలు సడలిస్తున్న తరుణంలో (Henley Passport Index 2021) ఈ నివేదిక వెలువడింది.
ముందస్తు వీసా అవసరం లేకుండా ఒక దేశ పౌరులు ఎన్ని గమ్యస్థానాలకు వెళ్లవచ్చనే సంఖ్య ఆధారంగా (Henley Passport Index 2021) ర్యాంకులు రూపొందిస్తారు. సింగపూర్, జపాన్ ప్రజలు 192 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. భారత్ ప్రజలు 58 దేశాలకు ఇలా వెళ్లవచ్చు. తాజా ర్యాంకుల్లో భారత్ సరసన తజికిస్థాన్, బుర్కినా ఫాసో నిలిచాయి. వరసగా మూడో ఏడాది కూడా జపాన్ తొలిస్థానంలో నిలిచింది. అఫ్గానిస్థాన్, ఇరాక్, సిరియా, పాకిస్థాన్, యెమెన్ దేశాలు అట్టడుగున ఉన్నాయి.
ఇదీ చూడండి : పాక్ సరిహద్దు తెరవాలంటూ అఫ్గాన్ పౌరుల ఆందోళన- రాళ్లదాడి!