ETV Bharat / international

మరోసారి లాక్​డౌన్​ దిశగా పారిస్​!

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో కరోనా విజృంభణ మళ్లీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరిగి లాక్‌డౌన్‌ విధించే యోచనలో ఉన్నారు అక్కడి అధికారులు. వైరస్​ కట్టడికి ఈ తరహా కఠిన చర్యలు అవసరమని వారు భావిస్తున్నారు.

Paris may face new Covid-19 lockdown as intensive care fills up
మరోసారి లాక్​డౌన్​ దిశగా పారిస్​!
author img

By

Published : Mar 15, 2021, 6:54 AM IST

రెండోసారి కరోనా విజృంభిస్తున్న వేళ ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో తిరిగి లాక్‌డౌన్‌ విధించే అవకాశం కనిపిస్తోంది. కొత్త తరహా కరోనా కేసుల నేపథ్యంలో వ్యాధిగ్రస్థులతో ఐసీయూలు నిండుతుండటం సహా టీకా సరఫరా తగ్గిపోగా.. ఈ మేరకు లాక్‌డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్య సంస్థ అధిపతి జెరోమ్ సలోమన్ తెలిపారు. ప్రస్తుతం పారిస్ పరిసర ప్రాంతంలో పరిస్థితి క్లిష్టంగా మారుతోందని చెప్పారు.

దేశంలోని పలుచోట్ల వేగంగా వ్యాపిస్తున్న కొవిడ్‌ కట్టడికి కర్ఫ్యూ ఏ మాత్రం సరిపోదని సలోమన్​ పేర్కొన్నారు. పారిస్‌లో కేసులు పెరుగుతున్నందున తక్కువ తీవ్రత ఉన్న ప్రాంతాలకు వ్యాధిగ్రస్థులను తరలిస్తున్నారు. ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు 40 లక్షల మందికిపైగా కొవిడ్ బారిన పడగా.. 90 వేల 315 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:ఐర్లాండ్​లో ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీని నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.