పారా బాడ్మింటన్ క్రీడాకారిణి మానసి జోషి, వాతావరణ మార్పుపై పోరాడిన రిధిమా పాండేకు 'బీబీసీ 100 విమెన్ 2020' జాబితాలో చోటు లభించింది. వీరితో పాటు 82ఏళ్ల బిల్కిస్ బానో, తమిళనాడుకు చెందిన ఇసాయ్వాణికి ఈ గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన, ప్రభావశీల మహిళలతో ఈ జాబితా రూపొందించారు. ప్రముఖ మహిళల నుంచి ప్రతిభ ఉన్నా గుర్తింపునకు నోచుకోనివారినీ లిస్టులో చేర్చారు.
'హౌ విమెన్ లీడ్ ఛేంజ్ ఇన్ 2020' ఈ సంవత్సరం ఇతివృత్తంగా ఉంది. కరోనాపై ముందుండి పోరాడిన మహిళా వైద్య సిబ్బందికి సైతం ఇందులో చోటు కల్పించారు.
నలుగరు భారతీయులు
మానసి జోషి పారా బాడ్మింటన్ సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకులో కొనసాగుతున్నారు. ఎన్నో రికార్డులు నెలకొల్పి యువతకు స్ఫూర్తిగా నిలిచారు.
ఇదీ చదవండి : 'దివ్యాంగుల గొంతుకగా మారడం గర్వంగా ఉంది'
తొమ్మిదేళ్ల వయసులోనే రిధిమా పాండే కేంద్రానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. వాతావరణ మార్పుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవటంపై ప్రశ్నించారు. భారత్‌తోపాటు మరో నాలుగు దేశాలపైనా ఐక్యరాజ్యసమితిలో పిటిషన్ దాఖలు చేశారు.
ఇదీ చదవండి : పర్యావరణ పరిరక్షణకై ఐరాసలో భారత యువతి ఫిర్యాదు
జాతీయ పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా 82ఏళ్ల బిల్కిస్ బానో పోరాడారు.
ఇదీ చదవండి : మోదీ నా కుమారుడితో సమానం: షాహీన్‌బాగ్ ఉద్యమకారిణి
ఇసాయ్వాణి... గాన అనే తమిళ శాస్త్రీయ సంగీతాన్ని ఆలపించి ఎందరికో స్ఫూర్తినిచ్చారు. కేవలం పురుషులే ఈ సాధన చేయగలరన్న నానుడిని పక్కనపెట్టి యువ గాయనీమణులకు ఆదర్శంగా నిలిచారు.