ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ ఆంగ్ల నిఘంటువులో మరో భారతీయ పదానికి చోటు లభించింది. భారత్లో విరివిగా వాడే 'చడ్డీ' పదాన్ని 'చడ్డీస్'గా నిఘంటువులో చేర్చారు. తాజాగా 650 కొత్తపదాలను చేర్చిన ఆక్స్ఫర్డ్ ఆంగ్ల నిఘంటువును గురువారం విడుదల చేశారు.
బ్రిటీష్ పాలనలో భారత్ ఉన్నప్పుడు ప్రభుత్వ గెజిట్, అలాగే ఇతర ప్రచురణల్లో 'చడ్డీ' పదాన్ని ఉపయోగించేవారు. అయితే ఈ చడ్డీస్ పదం 1990ల్లో బీబీసీలో ప్రసారమైన బ్రిటిష్-ఏసియన్ హాస్య ధారావాహిక 'గుడ్నెస్-గ్రేసియస్ మీ'తో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ నిఘంటువులో 'చడ్డీస్' పదానికి షార్ట్ ట్రౌజర్లు, షార్ట్స్, అండర్ ప్యాంట్స్ అర్థాలు కనిపించనున్నాయి.