ETV Bharat / international

బ్రిటన్​లో 6 లక్షల మందికి టీకా పంపిణీ - ఫైజర్​

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో టీకా పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే రష్యా, అమెరికా, చైనా, చిలీ వంటి దేశాల్లో వ్యాక్సినేషన్​ ప్రారంభం కాగా.. బ్రిటన్​లో ఇప్పటివరకు 6 లక్షల మందికిపైగా ఫైజర్​ టీకా మొదటి డోస్​ను పంపిణీ చేసినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది.

author img

By

Published : Dec 26, 2020, 6:25 AM IST

బ్రిటన్‌లో దాదాపు ఆరు లక్షల మందికిపైగా ఫైజర్‌ వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ను పంపిణీ చేసినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. 'దేశవ్యాప్తంగా మొత్తం 6 లక్షల 16 వేల 933 మందికి కరోనా టీకా ఇవ్వడంలో కృషి చేసిన జాతీయ ఆరోగ్య సేవా సంస్థలకు ధన్యవాదాలు' అని ఆరోగ్య శాఖ పేర్కొంది. పంపిణీలో భాగంగా ఇంగ్లాండ్‌లో 5,21,000, స్కాట్లాండ్‌లో 56,000, వేల్స్‌లో 22,000, నార్త్‌ ఐర్లాండ్‌లో 16,000 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు సంబంధిత శాఖ వెల్లడించింది.

'రానున్న రోజుల్లో వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తాం. వ్యాక్సిన్‌ డోసుల సంఖ్యను పెంచి నేరుగా సంరక్షణ గృహాల ద్వారా ప్రజలకు అందిస్తాం' అని ఆ శాఖ తెలిపింది. గత వారం బ్రిటన్‌లో కొత్తరకం వైరస్‌ బయటపడింది. ఈ కొత్తరకం వైరస్‌ అతివేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో అనేక దేశాలు బ్రిటన్‌తో రాకపోకలు నిలిపివేశాయి.

ఇదీ చూడండి: బ్రిటన్​లో ప్రతి 85 మందిలో ఒకరికి కరోనా!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.