ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 25 లక్షలు దాటిన 'కరోనా' కేసులు

author img

By

Published : Apr 22, 2020, 5:12 AM IST

ప్రపంచంపై కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. మృతుల సంఖ్య 1.74 లక్షలకు చేరగా.. కేసుల సంఖ్య 25 లక్షలు దాటింది. గత 24 గంటల వ్యవధిలో బ్రిటన్​లో వైరస్​ కారణంగా 828 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్​లో 531 మంది, ఇరాన్​లో 88 మంది మరణించారు.

coronavirus
కరోనా వైరస్

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ యథేచ్ఛగా సాగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇప్పటివరకు 25 లక్షల మంది ఈ వైరస్ బారి పడ్డారు. ఇందులో 80 శాతం కేసులు ఐరోపా, అమెరికాలోనే నమోదు కావడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గత 24 గంటల వ్యవధిలో పలు దేశాల్లో కలిపి 6,837 మంది మరణించడం వల్ల మొత్తం మృతుల సంఖ్య 1,77,234కి చేరింది.

అమెరికాలో 45వేలు దాటిన మృతులు

అమెరికాలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. కొత్తగా నమోదైన 10 వేల కేసులతో ఆ దేశంలో బాధితుల సంఖ్య 8,16,385కి పెరిగింది. 2,660 మంది మృతితో మొత్తం మరణాల సంఖ్య 45,174కి చేరింది.

Over 2.5 mn confirmed coronavirus cases worldwide: AFP tally
ప్రపంచవ్యాప్తంగా 25 లక్షలు దాటిన 'కరోనా' కేసులు

బ్రిటన్​లో 828

బ్రిటన్​లో వైరస్ కారణంగా మరో 828 మంది ప్రాణాల కోల్పోయారు. దీంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 17,337కి చేరినట్లు బ్రిటన్ వైద్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. సోమవారం ప్రకటించిన గణాంకాలతో పోలిస్తే మృతుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు చెప్పారు.

విధుల్లోకి బోరిస్!

కరోనా నుంచి కోలుకున్న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ క్రమంగా ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించడానికి తన మంత్రివర్గంతో పాటు, అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు. దేశంలో కరోనా సమాచారం గురించి ఎప్పటికప్పుడు ప్రధానికి తెలియజేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

లెక్కల చిక్కులు

ప్రభుత్వం వెలువరించిన గణాంకాలతో పోలిస్తే ఇంగ్లండ్, వేల్స్​లో కరోనా మరణాలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 10 నాటికి ప్రభుత్వం వెల్లడించిన లెక్కలతో పోల్చితే 41 శాతం అధికంగా ఉన్నట్లు అధికారిక గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.

ఇంగ్లండ్, వేల్స్​లో ఏప్రిల్ 10 వరకు 1,662 మంది మృతి చెందినట్లు యూకే జాతీయ గణాంక కార్యాలయం(ఓఎన్​ఎస్) తాజాగా ప్రకటించింది. ఈ మరణాలన్నీ ఆస్పత్రుల వెలుపల సంభవించినట్లు స్పష్టం చేసింది.

ఇంగ్లండ్, వేల్స్​లో ఇప్పటివరకు 13,121 మంది మరణించారు. అదే సమయంలో వైద్య శాఖ ప్రకటించిన ఆస్పత్రుల్లో మరణించిన వ్యక్తుల సంఖ్యతో(9,288) పోలిస్తే ఇది చాలా అధికం. కరోనా పాజిటివ్​గా తేలిన మరణాలనే ఆస్పత్రులు పరిగణనలోకి తీసుకుంటున్న నేపథ్యంలో మృతుల సంఖ్యలో అసమానతలు తలెత్తుతున్నాయి.

ఫ్రాన్స్

ఫ్రాన్స్​లో కరోనా మృతుల సంఖ్య 20,796కి చేరింది. కొత్తగా 531 మంది మరణించారు. ఆస్పత్రుల్లో 387 మంది, నర్సింగ్​ హోంలలో 144 మంది ప్రాణాలు కోల్పోయనట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రులు, అత్యవసర విభాగాలలో కొవిడ్ బాధితుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది.

ఇరాన్

ఇరాన్​లో కరోనాకు మరో 88 మంది బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య 5,297కి చేరినట్లు అధికారులు స్పష్టం చేశారు. కొత్తగా 1,297 కేసులు గుర్తించినట్లు వెల్లడించారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 84,802కు చేరినట్లు స్పష్టం చేశారు.

విదేశీ ఖైదీల విడుదల

కరోనా నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెయ్యి మందికి పైగా విదేశీ ఖైదీలను విడుదల చేసినట్లు తెలిపింది. మార్చి నుంచి దశలవారీగా విడుదల చేసిన లక్ష మందిలోనే ఈ విదేశీ ఖైదీలు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఖైదీల ఆరోగ్య క్షేమం కోరే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. జైలు నుంచి విడుదలైన వారిలో బ్రిటీష్-ఇరానియన్ మహిళ నజానిన్ జఘారీ రాటిక్లిఫ్ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశ ద్రోహం కేసులో 2016లో నజానిన్​ను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: నేడు దేశవ్యాప్తంగా వైద్యుల కొవ్వత్తుల ర్యాలీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.