ఫ్రాన్స్‌లోని లియాన్ నగరంలో ఓ క్రైస్తవ మతాధికారిపై గుర్తు తెలియని వ్యక్తి శనివారం కాల్పులు జరిపాడు. చర్చి వెలుపలే చోటు చేసుకున్న ఈ ఘటనకు కారణాలేమిటో తెలియరాలేదు.
ప్రాణాపాయ పరిస్థితుల్లో స్థానిక ఆసుపత్రిలో మతాధికారి చికిత్స పొందుతున్నారు. రెండ్రోజుల క్రితం ఇస్లామిక్ ఛాందసవాది ఒకరు ఫ్రాన్స్‌లో కేథలిక్ చర్చిపై కత్తితో దాడికి పాల్పడి ముగ్గురిని హతమార్చిన క్రమంలోనే ఇది కూడా చోటు చేసుకుంది.
ఇదీ చూడండి: ఐరోపాలో కరోనా విలయం- బ్రిటన్, పోర్చుగల్ లాక్డౌన్