ఫ్రాన్స్‌లో ఓ దుండగుడు కత్తితో బీభత్సం సృష్టించాడు. నీస్ నగరంలోని ఓ చర్చి వద్ద ప్రజలపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా పలువురు గాయపడ్డారు. గురువారం ఉదయం ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు నీస్ పోలీసులు వెల్లడించారు. అరెస్టు సమయంలో అతడు గాయపడిన కారణంగా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అయితే, నిందితుడు దాడికి పాల్పడిన కారణాలు తెలియరాలేదు.
ఫ్రాన్స్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న అనుమానాల నడుమ ఈ ఘటన జరగటం గమనార్హం. ఈ దాడిలో ఉగ్రకోణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కత్తి దాడి ఘటన నేపథ్యంలో వైరస్ ఆంక్షలపై చర్చను నిలిపేసిన పార్లమెంటు దిగువ సభ.. మృతులకు సంతాపం తెలుపుతూ మౌనం పాటించింది.
ఇదీ చూడండి: సరిహద్దు రక్షణకు రంగంలోకి ప్రధాని భార్య