ETV Bharat / international

'ప్రధానిని పేరుతో పిలవాలంటే భయమేసింది' - సెయింట్​ థామస్​ ఆస్పత్రి

బ్రిటన్​ ప్రధాని బోరిస్ జాన్సన్​ ఆసుపత్రిలో ఉండగా సేవలందించిన నర్సు.. తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ఆయనకు నర్సుగా ఎంపిక కావడం తనకు లభించిన గొప్ప అవకాశమని తెలిపారు.

nurse-talks-about-his-experience-treating-british-prime-minister-boris-johnson
'బ్రిటీష్​ ప్రధానికి సేవచేయడం గర్వంగా ఉంది'
author img

By

Published : Apr 23, 2020, 7:47 PM IST

కరోనా బారిన పడి కోలుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్​ జాన్సన్​కు​ సేవలందించిన నర్సు తన అనుభవాలను పంచుకున్నారు. కరోనా వైరస్ సోకి అనారోగ్యం పాలైన బోరిస్​.. వారం రోజులపాటు లండన్​ సెయింట్ థామస్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.

ఆయనకు సేవలందించేందుకు ఇద్దరు నర్సులను కేటాయించారు. వీరిలో ఒకరు.. పోర్చుగల్​కు చెందిన లూయీ పీతర్మ. థామస్​ ఆసుపత్రిలో నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు.

గొప్ప అవకాశం..

ప్రధానికి ఆరోగ్య సిబ్బందిగా తనను ఎంపిక చేశారని తెలియగానే భయమేసిందని ఆమె తెలిపారు. ప్రధానికి 3 రోజుల పాటు సేవలందించడం తనకు దక్కిన గొప్ప అవకాశమని ఆమె అన్నారు.

"ఆసుపత్రిలో ఉన్నప్పుడు బోరిస్​ అని పిలవాలన్నారు ప్రధాని. అలా పిలవడానికి కాస్త భయపడ్డాను. ఆయనకు దగ్గరుండి సేవలందించటం ఎంతో గర్వంగా ఉంది."

- లూయీ పీతర్మ

ప్రధాని నుంచి ప్రశంస..

కరోనా నుంచి కోలుకున్న జాన్సన్​ ఏప్రిల్​ 12న ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. ఆ సమయంలో పీతర్మతో పాటు న్యూజిలాండ్​కు చెందిన మరో నర్సు జెన్నీ మెక్​జీని ప్రశంసించారు. తనను చాలా బాగా చూసుకున్నారని తెలిపారు.

ఇదీ చదవండి: కరోనాతో సహజీవనం: లాక్​డౌన్​ ఎత్తివేత దిశగా ప్రపంచం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.