కరోనా రెండో దశలో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన డెల్టా సహా ఇతర వేరియంట్లతో పోల్చితే ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకరం అని చెప్పేందుకు ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీని లక్షణాలు కూడా ఇతర రకాల కంటే భిన్నంగా ఉన్నాయా? అనే విషయంపై ఎలాంటి సమాచారం లేదని పేర్కొంది. మరికొద్ది రోజుల్లో వీటిపై స్పష్టత వచ్చే అవకాశముందని చెప్పింది(omicron variant).
దక్షిణాఫ్రికా దేశాల్లో కొత్తగా వెలుగుచూసిన B.1.1.529 వేరియంట్‌ను ఇప్పటికే ఆందోళనకర రకంగా ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ. దీనికి ఒమిక్రాన్ అని నామకరణం చేసింది. దీనిపై మరింత అవగాహన కోసం దక్షిణాఫ్రికా సహా ప్రపంచ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నట్లు పేర్కొంది(omicron news update). ఎవరైనా దీన్ని అర్థం చేసుకుంటే ఆ సమాచారాన్ని అందరితో షేర్ చేసుకుంటారని తెలిపింది. ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందనేందుకు ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పింది(omicron news).
ఈ వేరియంట్ ప్రభావంతో దక్షిణాఫ్రికాలో కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయని, అయితే అందుకు కారణం ఒమిక్రానేనా? లేదా ఇతర కారణాలున్నాయా? అనే విషయంపై అధ్యయనాలు చేపట్టినట్లు డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ప్రాథమిక డేటా తెలుపుతున్నా.. అది కొత్త వేరియంట్ వల్లనా? లేక కేసుల్లో పెరుగుదల కారణమా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని వివరించింది(omicron virus).
ఆఫ్రికా దేశాలపై ఆంక్షలు వద్దు..
ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దక్షిణాఫ్రికా దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించవద్దని ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ విజ్ఞప్తి చేసింది(who on omicron variant). దీనికి బదులు శాస్త్రీయ, అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలను పాటించాలని డబ్ల్యూహెచ్ఓ ఆఫ్రికా ప్రాంత డైరెక్టర్ మత్సిదిషో మోతి సూచించారు. ప్రయాణ నిషేధం విధిస్తే కొవిడ్ వ్యాప్తి తగ్గే అవకాశమున్నప్పటికీ.. దాని వల్ల ఎంతోమంది జీవితాలు, జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల చట్టాన్ని 190 దేశాలు గర్తించాయని గుర్తుచేశారు(omicron news).
ప్రశంసలు..
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను గుర్తించిన వెంటనే డబ్ల్యూహెచ్ఓకు సమాచారమిచ్చిన దక్షిణాఫ్రికాపై మోతే ప్రశంసల వర్షం కురిపించారు. అత్యంగా వేగంగా, పారదర్శకతతో వ్యవహరిచింనందుకు ఆ దేశ ప్రభుత్వాన్ని కొనియాడారు. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రజారోగ్య సమాచాారాన్ని ధైర్యంగా షేర్ చేశారని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆఫ్రికా దేశాలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు(omicron variant news). ప్రయాణ ఆంక్షలు విధించాలని సైన్స్ చెప్పడం లేదని, దీని వల్ల ఈ వేరియంట్ వ్యాప్తిని ప్రభావితం చేయలేమని వివరించారు. ఆంక్షల వల్ల ఆయా దేశాల ఆర్థికంగా మరింత నష్టపోవడం తప్ప మరో ప్రయోజనం ఉండదన్నారు(new virus 2021).
ఇదీ చదవండి: వెలుగుచూసిన మూడో ఒమిక్రాన్ కేసు.. ఫేస్ మాస్క్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం