ETV Bharat / international

పేదల ఆకలి తీర్చే 'డబ్ల్యూఎఫ్​పీ'కి నోబెల్​ శాంతి బహుమతి - ప్రపంచ ఆహార కార్యక్రమం

NobelPeacePrize2020
నోబెల్​ శాంతి బహుమతి
author img

By

Published : Oct 9, 2020, 2:36 PM IST

Updated : Oct 9, 2020, 3:18 PM IST

14:33 October 09

నోబెల్ శాంతి పురస్కారం

ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్​పీ)కి ఈ ఏడాది నోబెల్​ శాంతి బహుమతి దక్కింది. ఆకలిని ఎదుర్కొనేందుకు, సంక్షోభిత ప్రాంతాల్లో శాంతి, మెరుగైన పరిస్థితుల కోసం చోదక శక్తిగా పనిచేసినందుకు డబ్ల్యూఎఫ్​పీకి అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేయాలని నోబెల్ కమిటీ నిర్ణయించింది.  

అంతర్జాతీయ సంఘీభావం, బహుపాక్షిక సహకారం అవసరం గతంలో కంటే చాలా ఎక్కువగా ఉందని ఈ సందర్భంగా కమిటీ వ్యాఖ్యానించింది. కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొన్నారని, ఈ మేరకు దేశాలన్నీ డబ్ల్యూఎఫ్​పీకి ఆర్థిక సహాయం అందించాలని పిలుపునిచ్చింది.  

ఆశ్చర్యపోయా: డబ్ల్యూఎఫ్​పీ చీఫ్

గతేడాది 88 దేశాల్లోని 10 కోట్ల మందికి డబ్ల్యూఎఫ్​పీ సాయం అందించింది. శాంతి పురస్కారం లభించిందని తెలియగానే ఆశ్చర్యపోయానని డబ్ల్యూఎఫ్​పీ చీఫ్ డేవిడ్ బియాస్లే తెలిపారు. జీవితంలో మొదటిసారి తనకు ఏం మాట్లాడాలో తెలియట్లేదని అన్నారు. 

అత్యంత గోప్యంగా..

నార్వే రాజధాని ఓస్లోలో డిసెంబర్​ 10న నిర్వహించే కార్యక్రమంలో డబ్ల్యూఎఫ్​పీకి 1.1 మిలియన్ డాలర్లతో పాటు బంగారు పతకాన్ని అందిస్తారు. ఈ సారి 211 ప్రముఖులతోపాటు 107 సంస్థలు శాంతి పురస్కారానికి నామినేట్​ అయ్యారు. అయితే, ఈ అత్యున్నత పురస్కారం ఎవరికి దక్కుతుందనే విషయాన్ని నోబెల్ కమిటీ అత్యంత గోప్యంగా ఉంచింది.  

ఇదీ చూడండి: లూయిస్​ గ్లక్​కు నోబెల్​ 'సాహిత్య' పురస్కారం

Last Updated : Oct 9, 2020, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.