ETV Bharat / international

'కొవిడ్ చికిత్సలో హెచ్​సీక్యూ ప్రభావం చూపించట్లేదు' - covid-19 latest updates

కొవిడ్-19​ రోగులకు హైడ్రాక్సీక్లోరోక్విన్​తో​ చికిత్స అందించినా ఎలాంటి ప్రయోజనం లేదని బ్రిటన్ పరిశోధకులు తెలిపారు. ఈ ఔషధం ద్వారా కరోనా మరణాలు తగ్గడం లేదని స్పష్టం చేశారు. 1,542 మంది రోగులపై పరీక్షలు నిర్వహించి వివరాలు వెల్లడించారు.

No beneficial effect of hydroxychloroquine for COVID-19: UK trial
'కొవిడ్ చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్ ప్రభావం చూపించట్లేదు'
author img

By

Published : Jun 6, 2020, 9:39 AM IST

కొవిడ్​-19 చికిత్సకు దివ్య ఔషధంగా పనిచేస్తుందని భావిస్తోన్న హైడ్రాక్సీక్లోరోక్విన్​తో ఎలాంటి ప్రయోజనం లేదని బ్రిటన్ పరిశోధన తెలిపింది. ఇది రోగులపై ఎలాంటి ప్రభావం చూపించడం లేదని పేర్కొంది. ప్రఖ్యాత ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధన సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.

కొవిడ్-19​ సోకిన 1,542 మంది రోగులకు హైడ్రాక్సీక్లోరోక్విన్​తో చికిత్స అందించి వివరాలను పరిశీలించారు. సాధారణ చికిత్స తీసుకున్న మరో 3,132 కరోనా రోగుల వివరాలతో వీటిని పోల్చిచూశారు. 28 రోజుల అనంతరం హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎలాంటి ప్రభావం చూపలేదని తేల్చారు. ఈ ఔషధం కారణంగా కొవిడ్-19 మరణాల సంఖ్య తగ్గలేదని ప్రొఫెసర్​ పీటర్​ హార్బీ, మార్టిన్ లాండ్రే సంయుక్త ప్రకటనలో తెలిపారు.

హైడ్రాక్సీక్లోరోక్విన్, క్లోరోక్విన్​లను మలేరియా చికిత్సకు ప్రధాన ఔషధంగా ఉపయోగిస్తారు. ఇది కొవిడ్-19పై పోరులో గొప్ప మార్పుగా అవతరిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన అనంతరం దీని వాడకంపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఈ మాత్రలను కొద్ది రోజుల పాటు తీసుకున్నట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు.

ఇప్పుడు బ్రిటన్​ పరిశోధనలో కీలక విషయాలు తెలిసిన అనంతరం హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకంపై పునరాలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కచ్చితంగా ప్రభావం చూపుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేకపోయినా ప్రపంచ దేశాలు విరివిగా ఉపయోగిస్తున్నాయని హార్బీ చెప్పారు. ఇతర ప్రత్యామ్నాయ డ్రగ్స్​పై పరిశోధనలు విస్తృతం చేయాలన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.