ఆర్థిక సేవల రంగంలో భారత్, బ్రిటన్ల మధ్య సంబంధాల బలోపేతం, ద్వైపాక్షిక పెట్టుబడుల్లో వృద్ధి దిశగా బ్రిటన్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా వచ్చే జులై 16న ఇండియా డే నిర్వహించనున్నట్లు యూకే ప్రభుత్వం, సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ మంగళవారం ప్రకటించాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
భారత్- బ్రిటన్ వారం-2019 ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నుంచి పార్లమెంటులో తొలి భారత దినోత్సవాన్ని నిర్వహించనుంది.
ఈ కార్యక్రమం ఇరుదేశాల మధ్య కొత్త అవకాశాల సృష్టి, ఆర్థిక, వృత్తి పరమైన సేవల్లో పరస్పర సహకారం పెంపు దిశగా మార్గం సుగమం చేస్తుందని బ్రిటన్ ఆశిస్తోంది.
సీతారామన్ అరుదైన ఘనత
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత సాధించారు. భారత్-బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషిచేసిన వంద మంది మహిళల జాబితాలో చోటుదక్కించుకున్నారు.
నిర్మలా సీతారామన్‌తో పాటు బ్రిటన్‌కు చెందిన కేబినెట్ మంత్రి పెన్నీ మొర్డౌంట్కూ ఈ జాబితాలో స్థానం లభించింది. హండ్రెడ్ మోస్ట్ ఇన్‌ప్లూయెన్సియల్ ఇన్ యూకే ఇండియా రిలేషన్స్... సెలబ్రేటింగ్ ఉమన్ పేరిట ఈ జాబితాను రూపొందించారు. ఇండియా డే సందర్భంగా లండన్ హౌస్ ఆఫ్ పార్లమెంట్లో ఆ దేశ హోంశాఖ కార్యదర్శి సాజిద్ జావేద్ ఈ జాబితా విడుదల చేశారు.
భారత్-యూకే ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో నిర్మలాసీతారామన్ క్రియాశీలకంగా వ్యవహరించారని జావేద్ ఉద్ఘాటించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదివి యూకేలో పనిచేసిన ఆమెకు బ్రిటన్ గురించి పూర్తిగా తెలుసని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఇరాన్ దాడులకు తెగబడితే దీటుగా సమాధానమిస్తాం: ట్రంప్