ETV Bharat / international

అమెరికా, బ్రిటన్​లపై కరోనా కాటు-రికార్డు స్థాయిలో మరణాలు - కరోనా లేటెస్ట్ న్యూస్

అమెరికా, బ్రిటన్​లను కరోనా వైరస్ కుదిపేస్తోంది. అమెరికాలోని ఒక్క న్యూయార్క్​లోనే 24 గంటల్లో అత్యధికంగా 731 మంది కొవిడ్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్​లోనూ రికార్డు స్థాయిలో 786 మంది మరణించారు.

అమెరికా, బ్రిటన్​లలో కరోనా విజృంభన
coronavirus deaths hit new record in us and uk
author img

By

Published : Apr 7, 2020, 10:26 PM IST

Updated : Apr 7, 2020, 10:42 PM IST

ఆగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. న్యూయార్క్​లో వైరస్​ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంది. ఇక్కడ 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 731 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో వెల్లడించారు.

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3 లక్షల 77 వేలకుపైగా కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. 11,781 మంది మరణించారు. దాదాపు 20 వేల మంది కోలుకున్నారు.

విలయతాండవం..

బ్రిటన్​లోనూ కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. మంగళవారం ఒక్కరోజే ఆ దేశంలో 786 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్​లో కరోనా కారణంగా ఒకే రోజు ఇంతమంది మరణించడం ఇదే తొలిసారి.

బ్రిటన్​లో ఇప్పటివరకు 55 వేల మందికిపైగా కరోనా సోకింది. 6,159 మంది మరణించారు. 135 మంది కోలుకున్నారు. ఆ దేశ​​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ వైరస్​ లక్షణాలతో ఓ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చూడండి:స్పెయిన్​లో గేర్​ మార్చిన కరోనా- మళ్లీ విజృంభణ

Last Updated : Apr 7, 2020, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.