ETV Bharat / international

'బ్రిటన్​ రకం' వైరస్​ జోరుకు కారణం ఇదే.. - బ్రిటన్​లో తొలి కరోనా కారకం

బ్రిటన్​లో గతేడాది డిసెంబర్​లో మొదటిసారి కనిపించిన కరోనా వైరస్​ రకం.. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఐరోపా, బ్రిటన్​లో రెండో విజృంభణకూ ఇది కారణమైంది. తాజాగా.. ఈ వైరస్​ రకం వ్యాప్తికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు శాస్త్రవేత్తలు. ఈ వైరస్​లోని న్యూక్లియోక్యాప్సిడ్​ జన్యువులో ఒక అదనపు ఉత్పరివర్తనే.. ​వైరస్​ వ్యాప్తికి కారణమని గుర్తించారు.

britan variant corona
'బ్రిటన్​ రకం' వైరస్​ జోరుకు కారణం ఇదే..
author img

By

Published : Mar 27, 2021, 5:51 AM IST

బ్రిటన్​లో తొలిసారి కనిపించిన కరోనా వైరస్​ రకానికి సంబంధించి కొత్త వివరాలను శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది ఉద్ధృతంగా వ్యాపించడానికి కారణాలను ఇవి వెలుగులోకి తెచ్చాయని వారు తెలిపారు. బ్రిటన్​లోని షెఫీల్డ్​ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ పరిశోధన చేశారు. బి.1.1.7 అనే ఈ రకం కరోనా వైరస్​ను గత ఏడాది డిసెంబర్​లో కెంట్​లో మొదటిసారి కనుగొన్నారు. ఆ తర్వాత అది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఐరోపా, బ్రిటన్​లో రెండో విజృంభణకు ఇది కారణమైంది.

ఈ రకం వైరస్​లోని న్యూక్లియోక్యాప్సిడ్​ జన్యువులో ఒక అదనపు ఉత్పరివర్తనను తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది వైరస్​లోని సబ్​జీనోమిక్​ ఆర్​ఎన్​ఏ ఉత్పత్తిపై ప్రభావం చూపుతోందని వివరించారు. ఫలితంగా మానవ రోగ నిరోధక వ్యవస్థను మరింత సమర్థంగా ఈ వైరస్​ ఏమారుస్తోందని చెప్పారు. బాధితుడి శరీరంలో తన సంఖ్యను భారీగా పెంచుకోవడానికీ వైరస్​కు ఇది వీలు కల్పిస్తోందని తెలిపారు. దీనివల్ల అతడిలో వైరల్​ లోడు అధికంగా ఉండటంతో పాటు వ్యాధి వ్యాప్తి కూడా ఉద్ధృతంగా ఉంటోందని చెప్పారు.

పూర్తిగా కొత్తదైన సబ్​జీనోమిక్​ ఆర్​ఎన్​ఏనూ శాస్త్రవేత్తలు గుర్తించారు. వైరస్​లోని ఓఆర్​ఎఫ్​9బీ అనే ప్రొటీన్​కు సంబంధించిన సూచనలు ఇందులో ఉన్నాయని తేల్చారు. మానవ రోగ నిరోధక వ్యవస్థను ఈ ప్రొటీన్​ నియంత్రిస్తుంటుందన్నారు. బ్రిటన్​ రకం వైరస్​లో ఓఆర్​ఎఫ్​9బీ అధికంగా ఉందని చెప్పారు. "మన రోగ నిరోధక వ్యవస్థను బి.1.1.7 ఎక్కువగా నియంత్రిస్తోంది. అందువల్ల ఇతర రకాలతో పోలిస్తే అది ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోంది" అని తెలిపారు.

ఇదీ చూడండి:కరోనా పుట్టుకపై నాలుగు సిద్ధాంతాలు- ఏది నిజం?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.