ETV Bharat / international

కొవిడ్​ నిమోనియాకు కొత్త విరుగుడు! - ద లాన్సెట్‌ రెస్పిరేటరీ మెడికల్‌ జర్నల్‌

'నామిలుమాబ్‌' అనే యాంటీబాడీ ఔషధం కరోనాపై సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. కొవిడ్‌-19 నిమోనియాతో ఆసుపత్రిపాలైన వారిపై జరిపిన ప్రయోగాల్లో ఈ విషయాన్ని గుర్తించారు బ్రిటన్‌ శాస్త్రవేత్తలు.

Namilumab
నామిలుమాబ్‌
author img

By

Published : Dec 18, 2021, 7:25 AM IST

కొవిడ్‌-19 నిమోనియాతో ఆసుపత్రిపాలైన రోగులకు సమర్థవంతమైన చికిత్స చేయడానికి పనికొచ్చే సరికొత్త ఔషధాన్ని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ అధ్యయన వివరాలు ప్రముఖ వైద్య పత్రిక 'ద లాన్సెట్‌ రెస్పిరేటరీ మెడికల్‌ జర్నల్‌'లో ప్రచురితమయ్యాయి. యూనివర్సిటీ ఆఫ్‌ బర్మింగ్‌హామ్‌, ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీల శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. నామిలుమాబ్‌ అనే యాంటీబాడీ ఔషధంపై వారు పరిశోధన చేశారు.

వాస్తవానికి.. కీళ్లవాతంతో ఆసుపత్రిపాలైన రోగులపై ఉపయోగించడానికి దీన్ని రూపొందించారు. ఇది తుది ప్రయోగాల్లో ఉంది. కొవిడ్‌-19 నిమోనియాతో ఆసుపత్రిపాలైనవారిపై ఇదెలా పనిచేస్తుందన్నది పరిశీలించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఈ రోగుల రక్తంలో ఇన్‌ఫ్లమేషన్‌కు సూచిక అయిన 'సి రియాక్టివ్‌ ప్రొటీన్‌' (సీఆర్‌పీ) స్థాయి చాలా ఎక్కువగా ఉంది. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ పెరిగినప్పుడు సీఆర్‌పీ స్థాయి పెరుగుతుంటుంది. దీని పరిమాణం పెరిగితే.. కొవిడ్‌ బాధితులకు తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ ముప్పు పొంచి ఉంటుంది.

శరీరంలో రోగ నిరోధక కణాలు సహజసిద్ధంగా సైటోకైన్లను విడుదల చేస్తాయి. ఇవి కొవిడ్‌ రోగుల్లో అపరిమితంగా ఉత్పత్తయి ఊపిరితిత్తుల్లో ప్రమాదకరస్థాయిలో ఇన్‌ఫ్లమేషన్‌ కలిగిస్తుంటాయి. సాధారణ చికిత్స, సంరక్షణ విధానాలతో పోలిస్తే నామిలుమాబ్‌ పొందినవారిలో సీఆర్‌పీ స్థాయి 97శాతం వరకూ తగ్గే అవకాశం ఉందని పరిశోధనలో వెల్లడైంది. ఈ ఔషధం తీసుకున్నవారిలో 78శాతం మంది 28వ రోజు కల్లా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.