ETV Bharat / international

తల్లి ఏజ్ 30.. కుమార్తెకు 14.. మనుమడి వయసు?.. ఇదొక క్రేజీ ఫ్యామిలీ స్టోరీ! - బ్రిటన్​ అమ్మమ్మ

Britain's Youngest Grandmother: ఆమె వయసు జస్ట్ 30+. కానీ.. మూడేళ్ల మనుమడు ఉన్నాడు. ఇదెలా సాధ్యమనుకుంటున్నారా? లండన్​కు చెందిన కెల్లీ హీలే ప్రత్యేకత అదే. 14 ఏళ్ల వయసులోనే కెల్లీ కుమార్తె బిడ్డకు జన్మనివ్వగా... బ్రిటన్​లో అత్యంత యువ అమ్మమ్మగా రికార్డు సృష్టించింది ఆమె.

Mother-of-five who became Britain's youngest grandmother

author img

By

Published : Mar 23, 2022, 6:52 PM IST

Britain's Youngest Grandmother: మూడు పదుల వయసులోనే అమ్మమ్మ అయింది బ్రిటన్​కు చెందిన ఓ యువతి. ఆమె కుమార్తె 14 ఏళ్ల వయసులోనే మగబిడ్డకు జన్మనివ్వడమే ఇందుకు కారణం. ప్రస్తుతం మూడేళ్లు వయసున్న మనుమడిని చూసి చాలా మంది తన కుమారుడని భావిస్తున్నారని చెబుతోంది ఆమె. ఇంత చిన్న వయసులోనే బామ్మను అవుతానని అనుకోలేదని అంటోంది.

Mother-of-five who became Britain's youngest grandmother
తల్లి కెల్లీ హీలేతో స్కై సాల్టర్​

అది 2018... అప్పుడు 30 ఏళ్ల వయసున్న కెల్లీ హీలే పశ్చిమ లండన్​ క్రాన్​ఫర్డ్​లో నివసించేది. అప్పటికే ఆమె ఐదుగురు పిల్లలకు తల్లి. వారిలో 14 ఏళ్ల స్కై సాల్టర్​ ఒకరు. స్థానిక యువకుడితో రిలేషన్​లో ఉన్న ఆ టీనేజర్​.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంది. ఆమె అనుమానం నిజమైంది. ఆమె గర్భవతి అని తేలింది. అబార్షన్​ చేయించుకుందామంటే వైద్యులు ఒప్పుకోలేదు. గర్భం దాల్చి ఇప్పటికే 36 వారాలు దాటిందని, ఇంత ఆలస్యంగా అబార్షన్ చేస్తే ప్రమాదమని హెచ్చరించారు. తక్షణమే వెస్ట్ మిడిల్​సెక్స్ ఆస్పత్రిలో చేరాలని సూచించారు. ఈ మాటలతో షాక్ అయిన స్కై సాల్టర్.. కాసేపటికి తేరుకుంది. "గర్భవతిని అని తెలియగానే షాక్ అయ్యా. అయితే.. గర్భంలోని శిశువు గుండె చప్పుడు వినగానే.. నా హృదయం ప్రేమతో నిండిపోయింది. నా జీవితంలో ఇకపై నా బిడ్డదే మొదటి స్థానమని, నాది రెండో స్థానమని ఆ క్షణం అర్థమైంది" అని చెప్పింది స్కై సాల్టర్.

14 ఏళ్లకే తల్లయిన స్కై సాల్టర్​

అండగా నిలిచిన తల్లి: ఎలాగోలా ధైర్యం చేసి ఇంట్లో వాళ్లకు విషయం చెప్పింది సాల్టర్. తల్లిదండ్రులదీ అదే పరిస్థితి. చివరకు ఆమె తల్లి సాల్టర్​ను అర్థం చేసుకుంది. "ఇంత చిన్న వయసులోనే నేను బామ్మను అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ.. కలయిక విషయంలో సరైన జాగ్రత్తలు పాటించలేదని స్కై సాల్టర్​పై ఇప్పుడు అరిచినంత మాత్రాన ఉపయోగం ఉండదు. జరిగిందేదో జరిగిపోయింది. ప్రేమ, మద్దతు అందించడమే నేను చేయగలిగింది. ఒక తల్లిగా ఇలాంటివన్నీ భరించాల్సిందే." అని చెప్పింది కెల్లీ.

తన కుమారుడు బెయిలీతో స్కై సాల్టర్​

ఇంట్లో వాళ్ల సాయంతో ఆస్పత్రిలో చేరింది స్కై సాల్టర్. 2018 ఆగస్టులో మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడికి బెయిలీ అని నామకరణం చేసింది. ఇదంతా జరిగి మూడేళ్లు గడిచింది. ఇప్పుడు అమ్మమ్మ కెల్లీ హీలే వయసు 33. స్కై సాల్టర్​కు 17 ఏళ్లు. ఆమె కుమారుడు బెయిలీకి మూడేళ్లు. "నేను ఇప్పటికీ 20+ వయసులో ఉన్నట్లే వ్యవహరిస్తా. అలాంటి నేను అమ్మమ్మను అయ్యానంటే కాస్త ఇబ్బందికరమే. నాకు మనుమడు ఉన్నాడని స్నేహితులు ఆటపట్టిస్తుంటారు. చాలా మంది అతడు నా కుమారుడు అనుకుంటారు. నా సంగతి ఎలా ఉన్నా.. 48 ఏళ్ల వయసులోనే తనకు మునిమనుమడు ఉన్నాడని అంగీకరించేందుకు నా తల్లి ఇంకా సిద్ధంగా లేదు" అని చెప్పింది కెల్లీ.

స్థానిక యువకుడితో రిలేషన్​లో ఉన్న సాల్టర్​

కుమారుడితో సాల్టర్​

రికార్డ్ ఎవరిదో?: 33 ఏళ్ల గెమ్మా స్కిన్నర్​ కుమార్తె 17 సంవత్సరాల వయసులో గతేడాది అక్టోబర్​లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. బ్రిటన్​లో అత్యంత యువ అమ్మమ్మ స్కిన్నరేనని అప్పుడు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కెల్లీ-స్కై కథ వెలుగులోకి వచ్చింది. బ్రిటన్​లో అత్యంత యువ బామ్మ ఎవరనే చర్చకు దారితీసింది.

ఇవీ చూడండి: భూకబ్జా కేసులో శివుడికి సమన్లు- విచారణకు రాకపోతే...

మనవడిపై తాత లైంగిక దాడి.. 73 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

45ఏళ్ల భర్తను వదిలి.. 22ఏళ్ల ప్రేమికుడితో వెళ్లి.. 25సిమ్​లు మార్చి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.