రష్యాలో సైనిక హెలికాఫ్టర్ కూలిన ఘటనలో నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఎంఐ-8 సైనిక హెలికాఫ్టర్ సాంకేతిక లోపం వల్ల చూకోటకా వద్ద ప్రమాదానికి గురైనట్లు ఆ దేశ రక్షణ మంత్రి వెల్లడించారు. అందులో ప్రయాణించిన ముగ్గురు సాధారణ సైనికులు, మరో టెక్నీషియన్ మరణించినట్లు స్పష్టం చేశారు.
వారంలో రెండోది!
ఎంఐ-8 హెలికాప్టర్ కూలిపోవడం ఈ వారంలో రెండోసారి. మాస్కోకు 90కిలోమీటర్ల దూరంలో ఉన్న క్లయిన్ వద్ద మే 19న హెలికాప్టర్ కూలింది. అప్పుడు కూడా సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు. ఆ ఘటనలో ముగ్గురు సిబ్బంది చనిపోయారు.
ఎంఐ-8 హెలికాప్టర్లను రష్యానే తయారు చేస్తోంది. రష్యా సైన్యంలో అతి సాధారణంగా ఉపయోగించే వాటిల్లో ఇదీ ఒకటి.
ఇదీ చూడండి: మన మహిళా మేజర్‌కు అంతర్జాతీయ అవార్డు