ETV Bharat / international

'నా భర్తను క్షేమంగా ఆంటిగ్వా చేర్చండి'

వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని క్షేమంగా ఆంటిగ్వాకు చేర్చాలని బ్రిటన్ రాణికి అర్జీ పెట్టుకోనున్నట్లు చోక్సీ భార్య తెలిపారు. తన భర్తకు న్యాయం దక్కేందుకుగాను ఆంటిగ్వా-బార్బుడా అధినేతగా సాయం అందించాల్సిందిగా బ్రిటన్ రాణికి లేఖ రాయనున్నట్లు తెలిపారు.

mehul choksi
మెహుల్ చోక్సీ, పీఎన్​బీ కుంభకోణం
author img

By

Published : Jun 6, 2021, 6:46 AM IST

పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించిన కుంభకోణంలో నిందితుడు మెహుల్ చోక్సీని సురక్షితంగా ఆంటిగ్వాకు తిరిగి తీసుకొచ్చే విషయంలో సాయం అందించాల్సిందిగా బ్రిటన్ రాణి ఎలిజబెత్​కి విజ్ఞప్తి చేసేందుకు ఆయన భార్య ప్రీతి చోక్సీ సిద్ధమవుతున్నారు. ఈమేరకు తమ కుటుంబీకులు, న్యాయవాదులు రాణికి అర్జీ పెట్టుకోనున్నట్లు ప్రీతి తెలిపారు.

మెహుల్ ప్రస్తుతం డొమినికాలో పోలీసుల నిర్భంధంలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి అతనికి పౌరసత్వం ఉన్న ఆంటిగ్వా-బార్బుడాకు చోక్సీని తరలించే విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా రాణిని కోరనున్నట్లు చెప్పారు. తన భర్తకు న్యాయం దక్కేందుకుగానుఆంటిగ్వా-బార్బుడా అధినేతగా సాయం అందించాల్సిందిగా బ్రిటన్ రాణికి రాయనున్నట్లు తెలిపారు. తన భర్త విషయంలో మానవహక్కుల ఉల్లంఘన జరిగిన విషయాన్ని రాణి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:

Mehul Choksi:​ చోక్సీ బెయిల్​ పిటిషన్​ తిరస్కరణ

మెహుల్​ చోక్సీపై ఆంటిగ్వా వైఖరేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.