ETV Bharat / international

హ్యరీ, మేఘన్​ ఇంట 'డయానా' సందడి!

author img

By

Published : Jun 6, 2021, 11:05 PM IST

ప్రిన్స్​ హ్యారీ, మేఘన్​ మార్కెల్​ దంపతులకు మరో బిడ్డ పుట్టింది. శుక్రవారం పండంటి ఆడబిడ్డకు మేఘన్​ జన్మనిచ్చారు. ఈ పాపకు 'లిల్లీబెట్​ లిలీ డయానా'గా నామకరణం చేశారు.

Meghan and Harry w
మేఘన్​, హ్యరీ దంపతుల రెండో బిడ్డ

మేఘన్​ మార్కెల్​, ప్రిన్స్ హ్యారీ దంపతులు మరోమారు తల్లిదండ్రులయ్యారు. మేఘన్​ మార్కెల్ శుక్రవారం​ రెండో బిడ్డకు జన్మనిచ్చారని ఓ అధికారి తెలిపారు. ఆదివారం ఈ పాపకు 'లిల్లీబెట్​ లిలీ డయానా'గా నామకరణం చేసినట్లు ప్రిన్స్​ హ్యారీ అధికార ప్రతినిధి తెలిపారు. పాప బరువు 7 పౌండ్లు(3.175 కిలోలు) ఉన్నట్లు చెప్పారు. అయితే.. ఈ పాప ఫొటోలు ఇంకా బహిర్గతం కాలేదు.

తాను గర్భవతిగా ఉన్న సమయంలో పుట్టబోయే బిడ్డ రంగు గురించి కుటుంబంలో చర్చ జరిగిందని మార్చి నెలలో ఓఫ్రా విన్​ఫ్రే ఇంటర్వ్యూలో మేఘన్​ మార్కెల్​ చెప్పిన నేపథ్యంలో.. తాజాగా ఆమెకు బిడ్డ పుట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రిన్స్‌ హ్యారీని పెళ్లి చేసుకుని బ్రిటన్‌ రాజకుటుంబంలోకి అడుగుపెట్టాక ఎన్నో ఇబ్బందులు పడ్డానని.. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని ఆమె ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 మనవడు అయిన ప్రిన్స్‌ హ్యారీ.. 2018లో అమెరికా నటి మేఘన్‌ మర్కెల్‌ను వివాహం చేసుకున్నారు. 2019లో వీరికి కుమారుడు ఆర్చీ పుట్టాడు. అయితే కుటుంబంతో విభేదాల కారణంగా గతేడాది హ్యారీ దంపతులు రాజకుటుంబం నుంచి బయటకు వచ్చేశారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.