ETV Bharat / international

'జలియన్ వాలాబాగ్'​పై థెరిసా మే విచారం - థెరిసామే

బ్రిటిష్ పాలనలో భారత్​లో జరిగిన  జలియన్​వాలా బాగ్​లో జరిగిన హింసాకాండ అత్యంత విచారకరమన్నారు బ్రిటన్ ప్రధాని థెరిసా మే. ఈ మేరకు బ్రిటన్ పార్లమెంట్​లో ప్రకటన చేశారు.

'జలియన్ వాలాబాగ్'​పై థెరిసా మే విచారం
author img

By

Published : Apr 10, 2019, 10:48 PM IST

భారత స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన జలియన్​వాలా బాగ్​ హింసాకాండకు వందేళ్లు పూర్తవుతున్న తరుణంలో విచారం వ్యక్తం చేసింది బ్రిటన్. ఏప్రిల్ 13, 1919నాటి ఈ ​ ఘటనపై ఆ దేశ ప్రధాని థెరీసా మే ఆవేదన వ్యక్తం చేశారు.

కొంతమంది సభ్యులు వ్యతిరేకించడం వల్ల అధికారికంగా క్షమాపణ చెప్పడం ఆగిపోయింది. ఈ ఘటనపై ఇంతకుముందే బ్రిటన్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసిందని తెలిపారు మే.

ఘటన జరిగిందిలా...

అవిభాజ్య పంజాబ్​ అమృత్​సర్​లోని జలియన్​వాలాబాగ్​లో జరిగిందీ దురాఘతం. స్వాతంత్ర పోరాటం కోసం భారతీయులు సమావేశం కాగా కల్నల్ రెజినాల్డ్ డయ్యర్ ఆదేశాల మేరకు కాల్పులకు తెగబడ్డాయి బ్రిటిష్ సేనలు. ఈ ఘటనలో 379మంది మృతి చెందారని, 1200మంది గాయపడినట్లు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అధికారిక లెక్కలు వేసింది.

'జలియన్ వాలాబాగ్'​పై థెరిసా మే విచారం

"1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఘటన బ్రిటిష్ ఇండియా చరిత్రలో మాయని మచ్చ. భారతదేశంలో బ్రిటన్ పాలనకు ఒక దుఃఖకరమైన ఉదాహరణగా 1997లో జలియన్​వాలాబాగ్​ను సందర్శించే ముందు ఎలిజబెత్​ రాణి ప్రకటించారు. సహకారం, భాగస్వామ్యం, భద్రత విషయంలో ప్రస్తుతం బ్రిటన్-భారత్ మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు కొనసాగుతున్నాయి. బ్రిటన్ అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో విలువైంది"

-థెరీసా మే, బ్రిటన్​ ప్రధానమంత్రి​

జెరెమీ కార్బిన్ సంతాపం

బ్రిటన్ ప్రతిపక్షనేత జెరెమీ కార్బిన్ సైతం జలియన్​వాలా బాగ్​ ఘటనపై బాగ్​పై విచారం వ్యక్తం చేశారు.

New Delhi, Apr 10 (ANI): Kashmiri separatist leader Yasin Malik was taken to the National Investigation Agency (NIA) headquarters in Delhi today. Malik was taken to the NIA after a Delhi court sent the Jammu and Kashmir Liberation Front (JKLF) chief on NIA remand till April 22. He was arrested in connection with 2017 terror financing and terror conspiracy case. Malik was brought to the national capital on Tuesday from Jammu jail after the NIA secured a production warrant against him in connection with a terror and separatism funding case in Jammu and Kashmir.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.