ETV Bharat / international

కుప్పకూలిన విమానం.. 'పాప్​స్టార్'​ దుర్మరణం - విమాన ప్రమాదంలో సింగర్​ మృతి

బ్రెజిల్‌ పాప్‌ స్టార్‌(brazil pop singer) మారిలియా మెండోన్సా (Marilia Mendonca death) విమాన ప్రమాదంలో కన్నుమూశారు. ప్రమాదానికి ముందు విమానంలో మెండోన్సా దృశ్యాలు అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి.

Marilia Mendonca
విమాన ప్రమాదంలో మారిలియా మెండోన్సా మృతి
author img

By

Published : Nov 6, 2021, 9:12 AM IST

Updated : Nov 6, 2021, 9:26 AM IST

మృత్యువు ఎప్పుడు.. ఎవరిని.. ఎలా.. కబళిస్తుందో తెలియదు. అప్పటివరకూ మనతో నవ్వుతూ గడిపిన ఆప్తులు.. మరు నిమిషంలో జరిగే ప్రమాదంలో శాశ్వతంగా దూరం కావొచ్చు. ఇలాంటి ఘటనే బ్రెజిల్‌లో జరిగింది. విమాన ప్రమాదంలో.. బ్రెజిల్‌ పాప్‌ స్టార్‌ (brazil pop singer) మారిలియా మెండోన్సా(26) కన్నుమూశారు(Marilia Mendonca death). ప్రమాదానికి ముందు విమానంలో మెండోన్సా దృశ్యాలు అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి.

  • essa é a realidade meu povo! hahahah💪🏼🏋🏻🥬🥦
    me conta aqui nos comentários mais delícias desse estado maravilhoso que é Minas Gerais! pic.twitter.com/cGBx2kJrzR

    — maria mendonça (@MariliaMReal) November 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎంతో ఉత్సాహంగా సంగీత కచ్చేరికి బయలుదేరిన బ్రెజిల్‌ పాప్‌స్టార్‌ (brazil pop singer) మారిలియా మెండోన్సాను.. విమాన ప్రమాదం బలితీసుకుంది. ఆమెతో పాటు మరో నలుగురు ఈ ప్రమాదంలో కన్నుమూశారు.

Marilia Mendonca
ప్రమాదానికి గురైన విమానం

ప్రమాదానికి ముందు దృశ్యాలు వైరల్​..

ప్రయాణానికి ముందు చేతిలో గిటార్‌తో విమానం వైపు వెళ్తున్న వీడియోను మెండోన్సా.. ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. విమానంలో ఆహారాన్ని తింటున్న దృశ్యాలను కూడా పోస్ట్‌ చేశారు. స్త్రీ వాద సమస్యలే ప్రధాన భూమికగా ఆమె పాటలు సాగేవి. మహిళా సాధికారిత కోసం ఆమె తన గళాన్ని ప్రపంచానికి వినిపించారు. బ్రెజిల్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన పాప్‌స్టార్‌ అయిన మెండోన్సా.. ప్రతిష్టాత్మకమైన లాటిన్ గ్రామీ పురస్కారాన్ని 2019లో అందుకున్నారు.

Marilia Mendonca
విమానంలో మారిలియా మెండోన్సా

మెండోన్సా ప్రయానిస్తున్న విమానం మినాస్ గెరైస్ రాష్ట్రంలోని కరాటింగాలో కూలి పోయింది. ప్రమాదంలో మరణించింది మెండోన్సానే అని పోలీసులు ధ్రువీకరించారు. ప్రమాదానికి గల కారణాలు వివరించలేదు.

Marilia Mendonca
ప్రమాదానికి ముందు విమానంలో మారిలియా మెండోన్సా

శోకసంద్రంలో..

26 ఏళ్ల వయసులోనే మెండ్సోనా మరణించడంతో ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అభిమానులు, రాజకీయ నాయకులు, సంగీతకారులు, సాకర్ ఆటగాళ్లు ఆమెకు నివాళి అర్పించారు. ఎమ్ టోడోస్ ఓస్ కాంటోస్.. పాట్రోయాస్.. ఆల్పమ్స్‌తో మెండ్సోనా.. ప్రసిద్ధి చెందారు.

ఇదీ చూడండి: భార్యను మేకప్​ లేకుండా చూసి భర్త షాక్​- విడాకులకు దరఖాస్తు

Last Updated : Nov 6, 2021, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.