ఓ వ్యక్తి హడావుడిగా ఆస్పత్రికి చేరుకున్నాడు. తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటే.. ఏమైందని అడగ్గా అతడు చెప్పిన సమాధానం విని షాకయ్యారు వైద్యులు. అతడి మలాశయంలో ఓ ఫిరంగి గుండు(బాంబ్ షెల్) ఇరుక్కుంది మరి.
ఇంగ్లాండ్ గ్లూసెస్టర్లోని గ్లూసెస్టర్ షైర్ రాయల్ ఆస్పత్రి వద్ద జరిగిందీ సంఘటన.
ఓ ప్రైవేటు ఆయుధశాల శుభ్రపరుస్తుంటే జారి షెల్‌పై పడగా.. అది మలాశయంలోకి చొచ్చుకుపోయిందని బాధితుడు చెప్పాడు.
కంగారుపడ్డ వైద్యులు.. అతడిని అత్యవసర విభాగానికి తరలించారు. దాదాపు 2 అంగుళాల పరిమాణం ఉన్న ఆ షెల్‌ను తీయడం వైద్యులకు కష్టతరంగా మారింది. ప్రత్యేక నిపుణుడి సలహా తీసుకున్నారు.
రోగులు, వారి బంధువులు, వైద్య సిబ్బందికి ఎలాంటి ప్రమాదం కలగకుండా.. ప్రోటోకాల్ ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది.
బాంబ్ స్క్వాడ్ కూడా..
కేసు గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. వారి ద్వారా ఈ విషయం రక్షణ శాఖకు చేరగా.. ముందు జాగ్రత్తగా బాంబ్ స్క్వాడ్‌ను కూడా తరలించారు అధికారులు.
ప్రైవేటు ఆయుధశాల తనదేనని ఓ మిలిటరీ కలెక్టర్ వివరించారు. బాధితుడు శుభ్రం చేస్తూ పడిపోవడం వల్లే.. 80 ఏళ్ల నాటి ఆ పేలుడు పదార్థం అతడి మలాశయంలో ఇరుక్కుపోయిందని వైద్యులకు చెప్పారు.
పాత జ్ఞాపకాలను పదిలంగా భద్రపరుచుకునేందుకే.. మిలిటరీ కలెక్టర్ ఆయుధాలను సేకరించారని తెలుస్తోంది. ఈ రెండు అంగుళాల బాంబ్ షెల్ కూడా రెండో ప్రపంచ యుద్ధం నాటిదే.
ఇదీ చూడండి: మలాశయంలో ఇరుక్కున్న టాయిలెట్ స్ప్రేయర్- చివరకు...