స్వర మాధుర్యాన్ని రికార్డు చేసి, దశాబ్దాల తరబడి ప్రపంచానికి వీనుల విందు చేసిన క్యాసెట్ టేపుల సృష్టికర్త లూ ఓటెన్స్ (94) కన్నుమూశారు. శనివారం ఆయన మృతిచెందినట్టు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ ఫిలిప్స్ వెల్లడించింది. నెదర్లాండ్స్‌కు చెందిన ఆయన.. కాంపాక్ట్ డిస్క్ (సీడీ)ల తయారీలోనూ కీలక భూమిక పోషించారు. స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ చదివిన ఓటెన్స్ 1952 లో ఫిలిప్స్ సంస్థలో చేరారు. ప్రొడక్ట్ డెవలప్మెంట్ విభాగానికి అధిపతిగా పనిచేశారు.
1962లో తొలిసారిగా
1960 తొలి నాళ్లలో ఆయన చెక్క పెట్టెతో కూడిన పెద్ద సైజు టేపును అందుబాటు లోకి తెచ్చారు. 1962లో తొలిసారిగా మార్కెట్లోకి వచ్చిన క్యాసెట్ టేపులు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తర్వాత టేపుల పరిమాణాన్ని తగ్గించి, చిన్న పరికరాల్లో వాటిని వినేలా పలు ఆవిష్కరణలు చేశారు ఓటెన్స్.
ఇదీ చదవండి : 'ఇండో-పసిఫిక్‌లో శాంతి, సుస్థిరతకు క్వాడ్ కీలక పాత్ర'