ప్రపంచంలోని అనేక అరుదైన, ప్రత్యేక జంతువులకు కేంద్రం లండన్ జూపార్కు. ఈ ప్రత్యేక జంతువుల ఆరోగ్య పరిరక్షణకు కాసింత ప్రత్యేక పద్ధతులనే అనుసరిస్తోంది ఈ జూపార్కు నిర్వహణా విభాగం. వాటి బరువు, ఎత్తును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటి ఆరోగ్యంలో తేడా రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది.
జంతువుల బరువు, ఎత్తు కొలవడం కాస్త కష్టమే. మనుషులు చెప్పినట్టు అవి వినవు కదా మరి. అందుకే లండన్ జూలో సాధు జంతువులకైతే లాలించే పద్ధతిలో, సింహం లాంటి క్రూర జంతువులకైతే ఆహారాన్ని ఎరగా వేయడం ద్వారా.. వాటి బరువు, ఎత్తును లెక్కిస్తున్నారు.
ఓ కర్రకు స్కేలును అమర్చి, పై భాగంలో ఆహారం ఉంచడం ద్వారా సింహాన్ని దాని పై భాగంలోకి చేరేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా సింహం ఎత్తును కొలిచారు.
పెంగ్విన్లు, కోతులకు ఆహారాన్ని అందించి మచ్చిక చేసుకోవడం ద్వారా వాటి బరువును కొలిచారు.
గుడ్ల గూబల శరీర ఉష్ణోగ్రతను ప్రత్యేక యంత్రాలతో లెక్కించారు.
తాబేళ్లు, ఒంటెల బరువు, ఎత్తును కూడా ఆహారాన్ని అందిస్తూ కొలిచారు.
ఇదీ చూడండి: చింపాంజితో మహిళ అఫైర్.. 'జూ' అధికారులు ఏం చేశారంటే?