లండన్‌లో ఉగ్రదాడికి తెగించాడు ఓ ముష్కరుడు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ అగంతకుడు లండన్ వంతెన వద్ద కత్తితో దాడిచేసి పలువురిని గాయపరిచాడు. నకిలీ బాంబు చొక్కా వేసుకుని అందరినీ బెదిరించాడు. ప్రజలు భయంతో పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న పోలీసులు తక్షణం స్పందించి ముష్కరుని హతమార్చారు. అయితే వంతెనపై జరిగిన ఘటనను ఉగ్రదాడిగా స్కాట్లాండ్ యార్డ్ అధికారులు ప్రకటించారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఉగ్రదాడిలో ఎంతమంది గాయపడ్డారో అధికారులు ఇంకా నిర్థరించలేదు.
ట్రాఫిక్ బంద్..
ఉగ్రదాడి నేపథ్యంలో వంతెనపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. సమీపంలోకి కార్యాలయాలు, భవనాలు మూతపడ్డాయి. లండన్ బ్రిడ్జ్ రైల్వేస్టేషన్‌ను ముందుజాగ్రత్తగా మూసివేశారు.
ఎన్నికల ప్రచారం మధ్యలో..
ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్.. ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే ఆపేశారు. డౌనింగ్ స్ట్రీట్‌కు వచ్చిన ఆయన ఉగ్రవాద ఘటనపై అధికారులతో చర్చించారు. ఉగ్రదాడిని ఖండించారు. సకాలంలో స్పందించిన పోలీసులను అభినందించారు. బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు.
ఐసిస్ దాడి
2017 జూన్‌లో ఐసిస్ ఉగ్రవాదులు ఇదే లండన్ బ్రిడ్జ్‌పై... వ్యాన్‌తో ఢీకొని 11 మంది సామాన్య ప్రజల ప్రాణాలు బలిగొన్నారు. గత నెలలో బ్రిటన్ ప్రభుత్వం.. దేశంలో ఉగ్రవాద ముప్పు.. తీవ్రమైన నుంచి గణనీయమైన స్థాయికి చేరిందని ప్రకటించింది. అంటే దేశంలో ఉగ్రవాద ముప్పు ఎక్కువగా ఉండే అవకాశముందని తెలుస్తోంది.
ఇదీ చూడండి: రేపే ఝార్ఖండ్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు