ETV Bharat / international

థియేటర్​ డెలివరీ: ప్రజల వద్దకే ప్రదర్శన - థియేటర్​ డెలివరీ

ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ అంటే మనకు తెలుసు. కానీ 'థియేటర్ డెలివరీ' గురించి ఎప్పుడైనా విన్నారా? అవును.. ఇటలీ రోమ్​లో ఇది విస్తృత ప్రచారం పొందింది. కరోనా కారణంగా థియేటర్​లో ప్రదర్శనలు చూసేందుకు ఎవ్వరూ సాహసించటంలేదు.. దీంతో కళాకారులే.. ప్రజల వద్దకు వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రదర్శనల మెనూను ప్రేక్షకుల ముందు ఉంచి వారికి ఏది కావాలో ఆ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు.

Live theatre on demand - delivered to your door
థియేటర్​ డెలివరీ: ప్రజల వద్దకే రంగస్థల ప్రదర్శనలు
author img

By

Published : Mar 2, 2021, 6:45 PM IST

థియేటర్​ డెలివరీ: ప్రజల వద్దకే ప్రదర్శన

కరోనా కారణంగా ఇటలీ రోమ్​లో సినిమా హాల్స్​ మూతపడ్డాయి. దీంతో కొవిడ్ సంక్షోభంలో పూట గడిచేందుకు రంగస్థల ప్రదర్శనలు ప్రారంభించారు కళాకారులు. ప్రేక్షకులు బుక్​ చేసుకుంటే కళాకారులు స్కూటర్, సైకిల్​పై వాళ్లు కోరుకున్న చోటుకే వచ్చి రంగస్థల ప్రదర్శనలు చేస్తున్నారు. ఓ ప్రదర్శనల మెనూను రూపొందించి.. ప్రేక్షకులు ఏది కోరుకుంటే ఆ ఆటను ప్రదర్శిస్తున్నారు.

" థియేటర్​ డెలివరీ విధానం విజయవంతం అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ విధానం వల్ల కథలు చెప్పడం నేను కొనసాగిస్తాను. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇలాంటి ప్రదర్శనలు చేయటం ఎంతో ముఖ్యం. నేను దీన్ని ప్రజాసేవగా భావిస్తున్నాను. థియేటర్​ డెలివరీ విధానం.. పిజ్జా డెలివరీ విధానం లానే ఉంటుంది.. కానీ ఇక్కడ ఆహారం కాకుండా.. ఆత్మ సంతృప్తి లభిస్తుంది. కరోనాతో చాలా కాలం పాటు ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు.. థియేటర్​ డెలివరీ విధానం ద్వారా మానసిక సంతృప్తిని అందిస్తున్నాం."

--మిచెల్​ సెసారెట్టి సల్వీ, రంగస్థల కళాకారిణి

బుక్​ చేసుకుంటే..

మిగతా కళాకారులలానే కళాకారిణి సల్వీ సైతం.. రోడ్డు పక్కన, పార్కుల్లో ప్రదర్శనలు చేస్తున్నారు. ఓ బ్యాగు, మైక్​, ఇతర స్టేజ్ సామగ్రితో ప్రేక్షకులు కోరుకున్న చోట ఆమె వాలిపోతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడేలా ఓ ప్రదర్శన మెనూను రూపొందించి.. ఏ ప్రదర్శన కావాలి? ఎక్కడ ప్రదర్శించాలి? అని.. ఆన్​లైన్​లో బుక్ చేసుకుంటే.. అక్కడకు వచ్చి ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ విధానాన్ని కొంతమంది సమాజ సేవగా అభివర్ణిస్తున్నారు.

" థియేటర్​ డెలివరీ.. ఒక అద్భుతమైన విధానం. ఈ విధానంతో ప్రజల వద్దకే థియేటర్​ వస్తుంది. ప్రేక్షకులు ఇండోర్​ థియేటర్స్​కు వెళ్లాల్సిన అవసరం లేదు."

-- లూకా స్కార్​జోన్, విద్యార్థి

ఒక ఐడియా..

కళాకారిణి ఇప్పోలిటో చియారెల్లోకు వచ్చిన ఆలోచనను.. మిగతా కళాకారులు కలిసి అభివృద్ధి చేశారు. ఓ గ్రూప్​ను ఏర్పాటు చేసి ఇటలీ వ్యాప్తంగా ప్రదర్శనలు చేస్తున్నారు. కొవిడ్​-19 కారణంగా వినోద రంగం తీవ్రంగా దెబ్బతింది. మ్యూజియంలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నా.. థియేటర్స్​ ఎప్పుడు తెరుస్తారో మాత్రం స్పష్టత లేదని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటలీలోని ఓ పత్రిక కథనం ప్రకారం.. కరోనా ప్రబలినప్పటి నుంచి వినోద రంగం స్తంభించింది. 69 శాతం కార్యక్రమాలను నిలిపివేశారు. కళాకారులు 72 శాతం ఆదాయాన్ని కోల్పోయారు.

ఇదీ చదవండి : అరుదైన బటన్లతో మ్యూజియం.. ఎక్కడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.