ఇటలీలో నివాసముండే 21 ఏళ్ల ఖాబానీ లేమ్ అలియాస్ ఖాబీ లేమ్.. టిక్‌టిక్‌లో అతి తక్కువ సమయంలో అత్యధిక ఫాలోవర్లు గల సెలబ్రిటీగా అవతరించి సంచలనం సృష్టించాడు. 81 మిలియన్ల ఫాలోవర్లతో టిక్‌టాక్‌లో రెండో స్థానంలో ఉన్న ఆడిసన్ రేను వెనక్కి నెట్టాడు. జూన్‌లో 65 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ఖాబీకి ఇప్పుడు 84 మిలియన్లకుపైగా అభిమానులున్నారు. త్వరలోనే తను 120 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న చార్లీ డి అమెలియోను అధిగమించి నంబర్-1 స్టార్‌గా అవతరిస్తాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
ఎందుకింత ఆదరణ..
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఆఫ్రికా దేశం సెనెగలీస్కు చెందిన ఖాబీ ప్రస్తుతం ఇటలీలో ఉంటున్నాడు. తన ప్రత్యేక హావభావాలు, చేష్టలతో టిక్‌టాక్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. ఖాబీ చేసే చిన్న చిన్న స్కిట్లు, కొన్ని క్లిష్టమైన వీడియోలపై ఆయన వ్యంగ్యంగా స్పందించే విధానం అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆయన కామెడీ చూసినవారంతా పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు. దీంతో కొద్ది నెలల్లోనే ఆయనను అనసరించే వారి సంఖ్య కోట్లలో పెరిగింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఖాబీ కొద్ది నెలల క్రితం ఓ ఫ్యాక్టరీలో పని చేసేవాడు. కరోనా లాక్డౌన్ కారణంగా ఆయన ఉద్యోగం పోయింది. దీంతో టిక్‌టాక్ వీడియోలపైనే ఎక్కువ దృష్టి సారించి.. మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు.
![Khaby Lame overtakes Addison Rae to become the second most followed TikTok star in the world](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12452993_im1.jpg)
![Khaby Lame overtakes Addison Rae to become the second most followed TikTok star in the world](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12452993_im2.jpg)