ETV Bharat / international

ఆ 27 దేశాలను నమ్మి ఉక్రెయిన్​ మోసపోయిందా? - నాటో

Russia-Ukraine conflict: "ఐరోపా​లోని 27 దేశాల నేతలను సాయం కోరాను. వారంతా రష్యాకు భయపడుతున్నారు." అంటూ ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాతో పోరులో ఉక్రెయిన్​ ఒంటరైందనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమా? ఐరోపా దేశాలను నమ్మి ఉక్రెయిన్​ మోసపోయిందా?

Ukraine President
వొలొదిమిర్​ జెలెన్​ స్కీ
author img

By

Published : Feb 25, 2022, 4:21 PM IST

Russia-Ukraine conflict: ఉక్రెయిన్​పై రష్యా సైనిక చర్య రెండో రోజుకు చేరింది. భీకర దాడులు చేస్తోన్న రష్యాను నిలువరించండి మహాప్రభో అంటూ ఉక్రెయిన్​ వేడుకుంటోంది. అయితే.. ఆ దేశానికి మద్దతుగా అమెరికా సహా ఏ ఒక్క దేశమూ స్పష్టమైన ప్రకటన చేయలేదు. మేమూన్నామంటూ నేరుగా రంగంలోకి దిగడంలేదు. ఆపద కాలంలో అండగా ఉంటారని ఐరోపాలోని 27 దేశాలను నమ్ముకున్న ఉక్రెయిన్​కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందా? వారి అండ చూసుకుని రష్యాతో కయ్యం పెట్టుకున్న ఉక్రెయిన్​ మోసపోయిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది..

నాటో దళాలు మద్దతు ఇస్తున్నట్లు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవటం వల్ల కీవ్​ తనను తాను రక్షించుకునేందుకు ఒంటరి పోరాటం చేస్తోందని ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ తాజాగా పేర్కొన్నారు. " మీరు మాతో ఉన్నారా? అని వారిని అడిగాను. మాతోనే ఉన్నట్లు వారు సమాధానమిచ్చారు. కానీ, వారు కూటమిలోకి చేర్చుకోవాలనుకోవట్లేదు. నాటోలో ఉక్రెయిన్​ భాగమవుతుందా? అని 27 ఐరోపా​ దేశాల నేతలను నేరుగా ప్రశ్నించా. వారంతా భయపడుతున్నారు. కనీసం స్పందించటం లేదు" అని ఆందోళన వ్యక్తం చేశారు జెలెన్​స్కీ.

రష్యాను ఒంటరిగా ఎదుర్కోవాలని పశ్చిమ దేశాలు వదిలేశాయని ఆరోపించారు జెలెన్​స్కీ. ఈ సంక్షోభానికి తెరదించేలా చర్చలు జరిపేందుకు తాను భయపడటం లేదని స్పష్టం చేశారు. అయితే, అందుకు తమకు భద్రతాపరమైన హామీ కావాలన్నారు. శుక్రవారం తెల్లవారుజామున మాట్లాడిన అధ్యక్షుడు జెలెన్​స్కీ.. ఉక్రెయిన్​ ప్రమాదంలో ఉందని పశ్చిమ దేశాలకు తెలియజేసినట్లు చెప్పారు.

" రష్యా గురించి మేము భయపడటం లేదు. రష్యాతో మాట్లాడేందుకు భయం లేదు. ఉక్రెయిన్​కు తటస్థ స్థితి కోసం చర్చలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ, మా దేశానికి థర్డ్​పార్టీ గ్యారంటీ కావాలి. కానీ, ఇప్పుడు మేము నాటోలో లేము. రష్యా మిలిటరీ దాడులను ఆపేలా చర్చలు ఉండాలి."

- వొలొదిమిర్​ జెలెన్​ స్కీ, ఉక్రెయిన్​ అధ్యక్షుడు.

ఈ విషయంపై క్రెమ్లిన్​ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్​ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బంతి కీవ్​ కోర్టులోనే ఉందని స్పష్టం చేశారు.

బ్రిటీష్​ ఎయిర్​లైన్స్​పై రష్యా నిషేధం..

ఉక్రెయిన్​పై సైనిక చర్య చేపట్టిన క్రమంలో రష్యాపై పలు ఆంక్షలు విధించింది బ్రిటన్​. దానికి ప్రతీకారంగా బ్రిటీష్​ ఎయిర్​లైన్స్​పై నిషేధం విధించింది రష్యా. తమ విమానాశ్రయాల్లో దిగటం, తమ గగనతలాన్ని వినియోగించకుండా చేసింది.

ఇదీ చూడండి: 'కీవ్'లోకి రష్యా బలగాలు.. ఉక్రెయిన్​ హస్తగతమైనట్లేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.