అద్దాలు పగలగొట్టి చిన్నారులతో పాటు వారితో ఉన్న సంరక్షులను కాపాడారు పోలీసులు. విద్యార్థులను ఆసుపత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బస్సు డ్రైవర్ను ఇటలీలోని సెనెగలీస్ ప్రాంతానికి చెందిన 'ఔసినౌ సీ'గా పోలీసులు గుర్తించారు.
ఎలా జరిగిందంటే...
విద్యార్థుల బస్సును అపహరించిన ఔసినౌ.. బెదిరించి వారి చరవాణీలు తీసుకున్నాడు. చిన్నారుల చేతులను కట్టేయాలని లేదంటే చంపేస్తానని సంరక్షులను బెదిరించాడు. "మీలో ఎవరూ ఈ రోజు ప్రాణాలతో మిగలరు" అంటూ హెచ్చరించాడు. మధ్యధరా సముద్రంలో వలసవాదుల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటున్నానని నినాదాలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తెలివిగా ఫోన్ తనవద్దే దాచుకున్న ఓ చిన్నారి.. తల్లిదండ్రులకు సమాచారమిచ్చింది. వారు వెంటనే అధికారులకు తెలిపారు. మిలాన్ సరిహద్దులో బస్సును పోలీసులు అడ్డుకోగా బస్సుకు నిప్పంటించాడు దుండగుడు.
అపహరణ, సామూహిక హత్యాయత్నం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిబంధనల ప్రకారం ఔసినౌపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడు గతంలోనూ నేరాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.
ఇదీ చూడండి:తుపాకుల అమ్మకాలపై న్యూజిలాండ్ సర్కార్ నిషేధం