ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు(Whatsapp) భారీ జరిమానా పడింది. డేటా నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ ఐర్లాండ్‌కు చెందిన డేటా ప్రొటెక్షన్ కమిషన్ 225 మిలియన్ యూరోలను జరిమానాగా విధించింది. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.1950 కోట్లు అన్నమాట. వ్యక్తుల డేటాను ఇతర ఫేస్‌బుక్ కంపెనీలతో పంచుకునే విషయంలో పారదర్శకత పాటించకపోవడంతో ఈ జరిమానా వేసినట్లు డీపీసీ పేర్కొంది.
వాట్సాప్(Whatsapp) వినియోగదారులకు వారి డేటా ఎలా ప్రాసెస్ చేస్తామో అన్న విషయాన్ని వారికి తెలియజేసేలా తగిన సమాచారం ఇవ్వకుండా వాట్సాప్ నిబంధనలను ఉల్లంఘించిందని డీపీసీ పేర్కొంది. ఈ అంశంపై 2018లో విచారణ ప్రారంభించి తాజాగా జరిమానా విధించింది. జరిమానాపై వాట్సాప్ స్పందించింది. భారీ స్థాయిలో జరిమానా వేయడాన్ని తప్పుబట్టింది. దీనిపై తాము అప్పీల్‌కు వెళతామని పేర్కొంది.
ఇదీ చూడండి: Kabul Airport: కాబుల్ ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ ఎగిరిన విమానం..!