ETV Bharat / international

నౌకదాడులపై బ్రిటన్​ రాయబారికి ఇరాన్​ సమన్లు - చమురు

ఒమన్​ సమీపంలోని హొర్ముజ్​ జలసంధి వద్ద చమురు నౌకలపై దాడి చేసింది ఇరాన్ దేశమే అని  బ్రిటన్ ఆరోపించడాన్ని ఆ దేశం తీవ్రంగా తప్పుబట్టింది. బ్రిటన్​ రాయబారికి ఇరాన్​ విదేశీ వ్యవహారాలశాఖ సమన్లు జారీ చేసింది.

ట్యాంకర్​ దాడిపై బ్రిటన్​ రాయబారికి ఇరాన్​ సమన్లు
author img

By

Published : Jun 16, 2019, 8:23 AM IST

బ్రిటన్​పై ఇరాన్​ మండిపడింది. ఎటువంటి ఆధారాలు లేకుండా ఒమన్​ సమీపంలోని రెండు చమురు నౌకలపై దాడికి తామే కారణమని బ్రిటన్​ ఎలా ఆరోపిస్తుందని ప్రశ్నించింది.

ఈ మేరకు ఇరాన్​లోని బ్రిటన్​ రాయబారి రాబ్​ మెకైర్​కు ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ సమన్లు జారీ చేసింది. బ్రిటన్​ విదేశాంగ శాఖ తప్పుడు, అవాస్తవమైన ఆరోపణలు చేస్తోందని నోటీసులో పేర్కొంది.

బ్రిటన్​ విదేశాంగ కార్యదర్శి జెరేమీ హంట్ ఓ ప్రకటనలో ఒమన్​ సమీపంలోని చమురు నౌకలపై దాడి చేసింది ఇరాన్​ దేశమే అని అభిప్రాయపడ్డారు.

ఏం జరిగింది..?

అత్యంత రద్దీగా ఉండే హొర్ముజ్​ జలసంధిలో ఈ నెల 13న ఉదయం గంట వ్యవధిలో రెండు చమురు ఓడలపై దాడి జరిగింది. వాటిలోని నావికులు సురక్షితంగా బయటపడ్డారు. అమెరికా నౌకాదళం అక్కడకు చేరుకుని సాయం అందించింది.

ఇదీ చూడండి: బ్రిటన్​ టెక్​ వీసా దరఖాస్తుల్లో భారత్​ టాప్​

Dushanbe (Tajikistan), June 15 (ANI): Amid the Interaction and Confidence Building Measures in Asia (CICA) Summit, External Affairs Minister S Jaishankar met Foreign Minister of Islamic Republic of Iran, Javad Zarif in Dushanbe.They held bilateral meeting. Earlier, Bilateral meeting between Prime Minister Narendra Modi and Iran President Hassan Rouhani got cancelled due to scheduling issues in Bishkek.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.